Dec 02 2024డిసెంబరు 02 2024favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 డిసెంబరు 02 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసము శుక్ల పక్షం

తిథి: పాడ్యమి ఉ. 11.58 కు తదుపరి విదియ 3 మ. 12.24 కు
వారం: ఇందువారము (సోమవారం)
నక్షత్రం: జ్యేష్ఠ మ. 3.50 కు తదుపరి మూల 3 సా. 4.45 కు
యోగం: ధృతి సా. 04.01 కు తదుపరి శూల 3 మ. 03.08 కు
కరణం: బవ మ. 12.43 కు తదుపరి బాలవ రా. 12.59 కు
రాహుకాలం: ఉ. 07.30 - 09.00 కు
దుర్ముహూర్తం: మ. 12.28 - 01.13 కు & మ. 02.42 - 03.27 కు
వర్జ్యం: రా. 12.08 - 1.47 కు
అమృతకాలం: లేదు
సూర్యోదయం: ఉ. 6.31 కు
సూర్యాస్తమయం: సా. 5.41 కు

🕉️ పోలి స్వర్గం లేదా పోలి పాడ్యమి - దీపాలను అరటిదొన్నెలో విడవడం🕉️

గురుబోధ
మార్గశీర్ష మాసం మొదటి రోజున పాడ్యమీ తిథినాడు తెల్లవారుజామున చేసే స్నానమునకు కూడా కార్తికస్నానముతో సమానమైన మహాఫలితం లభిస్తుంది. పోలి స్వర్గం లేదా పోలి పాడ్యమి కథను ఈరోజు వినడం వలన, ఆవునేతి దీపాలను వెలిగించడం వలన సకల సంపదలు లభించి, శివానుగ్రహం సిద్ధిస్తుంది.
పరమపవిత్రమైనది ధనుర్మాసం. సౌరమానం ప్రకారం సూర్యభగవానుడు ధనూరాశిలోకి ప్రవశించే పుణ్యకాలం. ఈ మాసంలో శ్రీమన్నారాయణుని దివ్యపత్ని శ్రీనీళాదేవి, శ్రీగోదాదేవిగా భూలోకంలో జన్మించి నిరంతరం కావేరీనదిలో స్నానం చేస్తూ శ్రీరంగనాథుని భక్తితో సేవించింది. నెలరోజులపాటు భక్తిశ్రద్ధలతో స్వామిని సేవిస్తుండగా అపూర్వ వేదమంత్రాలే పాశురముల రూపంలో తన నోటి నుండి వెలువడి మానవాళికి అందించబడ్డాయి.

expand_less