Nov 16 2024నవంబరు 16 2024favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 నవంబరు 16 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయనం శరదృతువు కార్తిక మాసము కృష్ణ పక్షం

తిథి: పాడ్యమి రా. 1.09 కు తదుపరి విదియ 17 రా. 11.26 కు
వారం: స్థిరవారము (శనివారం)
నక్షత్రం: కృత్తిక రా. 9.17 కు తదుపరి రోహిణి 17 రా. 8.12 కు
యోగం: పరిఘ రా. 11.48 కు తదుపరి శివ 17 రా. 08.21 కు
కరణం: బాలవ మ. 01.21 కు తదుపరి కౌలవ రా. 11.50 కు
రాహుకాలం: ఉ. 09.00 - 10.30 కు
దుర్ముహూర్తం: తె. 06.22 - ఉ. 07.52 కు
వర్జ్యం: ఉ. 9.57-11.38 కు
అమృతకాలం: రా. 6.55 - 8.25 కు
సూర్యోదయం: ఉ. 6.22 కు
సూర్యాస్తమయం: సా. 5.40 కు

గురుబోధ:
ధర్మం అభివృద్ధి చెందడానికి భక్తితో మంత్రపూర్వకంగా రుద్రాక్షలను ధరించాలి. భస్మమును ధరించినవాడు, రుద్రాక్షను ధరించినవాడు శివుడికి అత్యంత ప్రీతిపాత్రులు. ఈ రెండింటిని ధరించినవారికి భక్తి, ముక్తి తప్పక లభిస్తాయి. ఈ రెంటినీ ధరించి పంచాక్షరీ జపం చేసేవాడు పరిపూర్ణ శివభక్తుడు.

expand_less