కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 నవంబరు 04 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయనం శరదృతువు కార్తిక మాసము శుక్ల పక్షం
తిథి: తదియ రా. 8.54 కు తదుపరి చతుర్థి 5 రా. 9.21 కు
వారం: ఇందువారము (సోమవారం)
నక్షత్రం: అనూరాధ ఉ. 7.04 కు తదుపరి జ్యేష్ఠ 5 ఉ. 8.21 కు
యోగం: శోభన ఉ. 11.44 కు తదుపరి అతిగండ 5 ఉ. 11.28 కు
కరణం: తైతుల ఉ. 10.47 కు తదుపరి గరజి రా. 11.24 కు
రాహుకాలం: ఉ. 07.30 - 09.00 కు
దుర్ముహూర్తం: మ. 12.23 - 01.08 కు & మ. 02.40 - 03.26 కు
వర్జ్యం: మ. 12.57 - 2.38 కు
అమృతకాలం: రా. 11.04 - 12.45 కు
సూర్యోదయం: ఉ. 6.16 కు
సూర్యాస్తమయం: సా. 5.43 కు
🕉️ మొదటి కార్తిక సోమవారం🕉️
గురుబోధ:
తనకు తోచినప్పుడల్లా అనేక పార్ధివలింగాలని తయారుచేసుకుని, వీలున్నప్పుడల్లా అర్చన చేసేవాడు, అందులో ముఖ్యంగా సోమవారం కానీ, చతుర్దశి నాడు కానీ, మాస శివరాత్రి కానీ, అష్టమినాడు కానీ, శివరాత్రి కానీ ఇటువంటి పర్వదినాలలో లెక్కపెట్టకుండా తోచినన్ని పార్ధివలింగాలని చేసి పూజించువాడు ముక్తి పొంది తీరుతాడు. నాకు భూమి కావాలి, కాస్త స్థలమో, పొలమో కావాలి అనుకున్నవాడు వెయ్యి పార్ధివలింగాలని భక్తితో పూజించి, అభిషేకిస్తే తప్పక భూమిని పొందుతాడు. శివానుగ్రహం ఒకటే కావాలనుకున్న వాడు, పరమేశ్వరుని యెుక్క కరుణ కావాలనుకున్న వాడు, 3000 పార్ధివలింగాలని అభిషేకం చేసుకోవాలి. అభిషేకాలు, అర్చనలు ఇంట్లో కంటే గుడిలో, గుడిలో కంటే తీర్ధ స్థలాలలో, నదీ తీరాలలో ఇంకొంచెం ఎక్కువ ఫలితాన్ని ఇస్తాయి. అదే గంగానదీ తీరంలో చేసుకుంటే ఎక్కువ ఫలితం ఇస్తుంది. కాశీ వంటి దివ్య క్షేత్రాలలో గంగాతీరంలో చేసుకుంటే అనంత ఫలితం ఇస్తుంది. ఇలా వారి వారి శక్తిని బట్టి చేసుకోమన్నారు. ఆర్ధికంగా చితికిపోయిన వారికి ఇది ఒక గొప్ప అవకాశం. శివుడు అవ్యాజకరుణామూర్తి. ఒకవేళ మన దగ్గర ధనం లేదు, అభిషేకము చేయడానికి పంచామృతాలు లేవు, అప్పుడు ఇన్ని నీళ్లు జల్లినా సంతోషిస్తాడు. - శ్రీ శివమహాపురాణం