కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 నవంబరు 03 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయనం శరదృతువు కార్తిక మాసము శుక్ల పక్షం
తిథి: విదియ రా. 7.57 కు తదుపరి తదియ 4 రా. 8.54 కు
వారం: భానువారము (ఆదివారం)
నక్షత్రం: అనూరాధ 4 ఉ. 7.04 కు తదుపరి జ్యేష్ఠ 5 ఉ. 7.04 కు
యోగం: సౌభాగ్య ఉ. 11.40 కు తదుపరి శోభన 4 ఉ. 11.44 కు
కరణం: బాలవ ఉ. 08.16 కు తదుపరి కౌలవ రా. 10.05 కు
రాహుకాలం: సా. 04.30 - 06.00 కు
దుర్ముహూర్తం: మ. 04.12 - 04.58 కు
వర్జ్యం: ఉ. 9.30 - 11.14 కు
అమృతకాలం: రా. 7.53 - 9.36 కు
సూర్యోదయం: ఉ. 6.16 కు
సూర్యాస్తమయం: సా. 5.44 కు
🕉️ కార్తిక శుద్ధ విదియ - యమవిదియ, భగినీహస్తభోజనం, అన్నాచెల్లెళ్ళ పండుగ🕉️
గురుబోధ
1) కార్తికమాసంలో రావిచెట్టుకు, వేపచెట్టుకు ప్రదక్షిణలు చేయడం మంచిది. ఆలయములో స్థంభముల వద్ద, ఇతర విగ్రహాల దగ్గర, చెట్టుకు కొంత దూరంగా మాత్రమే దీపం వెలిగించాలి. ధ్వజస్తంభం దగ్గర వెలిగించడం మరింత శ్రేష్ఠము.
2) దీపం వెలిగించేప్పుడు ఒక్క కొబ్బరినూనె తప్ప మిగిలిన నూనెలు ఉపయోగించవచ్చు. ఏ నూనెలో అయినా కొంత ఆవునెయ్యి వేయటం ద్వారా అది శ్రేష్ఠమవుతుంది.
3) పంచామృతాలతో అభిషేకం, బిల్వములతో కార్తికశుద్ధవిదియ రోజున చేసే పూజ విశేష ఫలితాన్ని ఇస్తుంది.
4) కలియుగంలో పార్థివలింగ పూజ అనేక శుభఫలితాలను ప్రసాదిస్తుంది. కోటి యజ్ఞములను, అనేక దానములు చేస్తే వచ్చే మహాఫలితం పార్థివలింగ పూజతో లభిస్తుంది. విశేష లక్ష్మీ అనుగ్రహం పొంది, డబ్బులు బాగా సంపాదించాలంటే పార్థివలింగాన్ని పూజించాలి.
https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial