Oct 31 2024అక్టోబరు 31 2024favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 అక్టోబరు 31 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజ మాసము కృష్ణ పక్షం

తిథి: చతుర్దశి మ. 2.43 కు తదుపరి అమావాస్య 01 సా. 4.45 కు
వారం: బృహస్పతివారము (గురువారం)
నక్షత్రం: చిత్త రా. 12.36 కు తదుపరి స్వాతి 02 తె. 3.03 కు
యోగం: విష్కంభ ఉ. 08.51 కు తదుపరి ప్రీతి 01 ఉ. 10.41 కు
కరణం: శకుని మ. 03.52 కు తదుపరి చతుష్పాద 01 తె. 05.06 కు
రాహుకాలం: మ. 01.30 - 03.00 కు
దుర్ముహూర్తం: ఉ. 10.05 - 10.51 కు & మ. 02.41 - 03.27 కు
వర్జ్యం: ఉ. 6.52 - 8.39 కు
అమృతకాలం: సా. 5.29 - 7.15 కు
సూర్యోదయం: ఉ. 6.14 కు
సూర్యాస్తమయం: సా. 5.45 కు

🕉️ దీపావళి, ధనలక్ష్మీ పూజ 🕉️

గురుబోధ:
దీపావళీ అమావాస్య నాడు ఆచరించవలసిన ముఖ్య విధివిధానాలు:
🕉️సూర్యోదయమునకు ముందే తప్పక అభ్యంగన స్నానం ఆచరించాలి.
🕉️దీపములు వెలిగించాలి. బ్రహ్మ దేవుడు అమ్మవారిని లోకశ్రేయస్సుకోసం ప్రార్థించగా, ఏ ఇళ్ళలో అయితే దీపాలు వెలుగుతూ ఉంటాయో, ఆ ఇళ్ళు సమృద్ధిగా ఆయురారోగ్యాలతో ఉంటాయని అమ్మవారు వరం ఇచ్చింది.
🕉️దీపావళి రోజు అమ్మవారిని వీలయితే తామర పువ్వులు, ఎఱ్ఱకలువ పూలతో పూజించాలి.
🕉️ఈరోజు అమ్మవారిని మనస్పూర్తిగా అష్టోత్తరంతో, సహస్రనామాలతో లేదా శ్రీసూక్తంతో కుంకుమ పూజ చేయాలి.
🕉️అమ్మవారికి పూజలో ఈ రోజు మన దగ్గర ఉన్న ఆభరణాలు సమర్పించాలి.
🕉️పులిహోర, దధ్యన్నం, పాయసాన్నం ఈ రోజు అమ్మకి నైవేద్యంగా సమర్పించాలి.
🕉️అమ్మవారికి ఈ రోజు నాలుగు ప్రదక్షిణలు చేయాలి.
🕉️దేవాలయంలో వీలయినన్ని ప్రదక్షిణలు చేయడం ముఖ్యంగా నవగ్రహాలకు 108 ప్రదక్షిణలు చేయడం మంచిది.
🕉️సాయంత్రం వేళ గుమ్మం దగ్గర నువ్వుల నూనెతో మాత్రమే దీపం వెలిగించాలి.
గోంగూర కాడలు నూనెలో నానబెట్టి, కాడకి వత్తి కట్టుకుని దిబ్బు దిబ్బు దీపావళి మళ్లీ వచ్చే నాగులచవితి అని అంటూ కింద కొట్టాలి. ఇలా చేస్తే వాస్తు దోషాలు, దృష్టి దోషాలు పోతాయి
🕉️రాత్రి తిరిగి ఇంటి గుమ్మం దగ్గర హారతి వెలిగించి, కళ్ళకు అద్దుకుని గుమ్మం బయట పారవేసి, కళ్ళు, కాళ్ళు కడుక్కోవాలి.
🕉️దీపావళి నాడు స్వయంపాకం దానం చేసేవాళ్ళు పితృదేవతల యెుక్క అనుగ్రహం పొందుతారు.

శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం👇
https://youtu.be/FNh6oGn-k8w

ఇంద్రకృత లక్ష్మీస్తోత్రం👇
https://youtu.be/if5zzw20GaQ

expand_less