కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 అక్టోబరు 25 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజ మాసము కృష్ణ పక్షం
తిథి: నవమి 26 ఉ. 06.20 తదుపరి దశమి 27 ఉ. 07.17
వారం: భృగువారము (శుక్రవారం)
నక్షత్రం: పుష్యమి మ. 12.08 కు తదుపరి ఆశ్లేష మ. 01.19 కు
యోగం: శుభ 26 తె. 05.27 కు తదుపరి శుక్ల 27 తె. 05.58 కు
కరణం: తైతుల మ. 02.35 కు తదుపరి గరజి రా. 03.22 కు
రాహుకాలం: ఉ. 10.30 - 12.00 కు
దుర్ముహూర్తం: ఉ. 08.31 - 09.18 కు & మ. 12.23 - 01.10 కు
వర్జ్యం: రా. 1.33 - 3.14 కు
అమృతకాలం: తె. 5.41 - ఉ. 7.11 కు
సూర్యోదయం: ఉ. 6.12 కు
సూర్యాస్తమయం: సా. 5.48 కు
గురుబోధ:
మనం ఆచమనం చేసిన పంచపాత్రలోని నీటిని దేవునికి నైవేద్యం, అర్ఘ్యం, తర్పణం లేదా నీరాజనము ఇవ్వడానికి ఉపయోగించరాదు. అందుకే రెండు పంచపాత్రలు అనగా మన ఆచమనానికి ఒకటి మరొకటి దేవతా పూజకు వాడాలని శాస్త్రం.