కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 అక్టోబరు 20 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజ మాసము కృష్ణ పక్షం
తిథి: తదియ ఉ. 10.44 కు తదుపరి చతుర్థి 21 ఉ. 08.56 కు
వారం: భానువారము (ఆదివారం)
నక్షత్రం: కృత్తిక మ. 1.14 కు తదుపరి రోహిణి 21 మ. 12.12 కు
యోగం: వ్యతీపాత మ. 02.12 కు తదుపరి వరీయాన్ 21 ఉ. 11.11 కు
కరణం: విష్టి తె. 06.46 కు తదుపరి బవ 21 సా. 05.26 కు
రాహుకాలం: సా. 04.30 - 06.00 కు
దుర్ముహూర్తం: మ. 04.18 - 05.04 కు
వర్జ్యం: తె. 4.31 - 6.03 కు
అమృతకాలం: ఉ. 11.00 - 12.30 కు
సూర్యోదయం: ఉ. 6.11 కు
సూర్యాస్తమయం: సా. 5.51 కు
🕉️ అట్లతద్దె, వ్యతీపాత యోగం 🕉️
గురుబోధ:
అట్ల తదియ వలన స్త్రీలకు సంతానప్రాప్తి, శుభాలు కలుగుతాయి అని పెద్దలు చెప్పారు. ఇటువంటి నోములను స్త్రీలు పాటించడం ద్వారా అన్ని రకాలుగా కుటుంబవృద్ధి, సకలశుభప్రాప్తి కలుగుతుందని శాస్త్రం.