కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 అక్టోబరు 11 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజ మాసము శుక్ల పక్షం
తిథి: అష్టమి ఉ. 6.45 కు తదుపరి నవమి 12 తె. 5.37 కు
వారం: భృగువారము (శుక్రవారం)
నక్షత్రం: ఉత్తరాషాఢ రా. 1.25 కు తదుపరి శ్రవణం 12 రా. 12.45 కు
యోగం: సుకర్మ రా. 02.47 కు తదుపరి ధృతి 12 రా. 12.22 కు
కరణం: బవ మ. 12.06 కు తదుపరి బాలవ రా. 11.37 కు
రాహుకాలం: ఉ. 10.30 - 12.00 కు
దుర్ముహూర్తం: ఉ. 08.30 - 09.17 కు & మ. 12.26 - 01.14 కు
వర్జ్యం: తె. 05.18 - 06.48 కు & ఉ. 9.35 - 11.10 కు
అమృతకాలం: రా. 7.11 - 8.50 కు
సూర్యోదయం: ఉ. 6.08 కు
సూర్యాస్తమయం: సా. 5.57 కు
🕉️ శరన్నవరాత్రులు 9వ రోజు- ఏలూరు శ్రీ ప్రణవపీఠంలో శ్రీ మహిషాసుర మర్దని అలంకారం 🕉️
https://youtu.be/wsxo-UEncbA?si=hfMdlNhraDPzEwgj
https://srivaddipartipadmakar.org/stotram/sri-devi-kavacham-sri-markandeya-puranam/
గురుబోధ:
శ్రీ దేవీ కవచం చదివి ఎక్కడికి వెళ్ళినా విజయం తప్ప అపజయం ఉండదు. ఉద్యోగం కావాలని ఈ కవచం చదివి ఆ ఉద్యోగ ప్రయత్నం చెయ్యండి, క్షణాలలో వస్తుంది. సంపద కావాలని శ్రద్ధతో వినండి, చదవండి, సంపదలు వస్తాయి. మాకు కీర్తి కావాలి, పదిమంది చేత ప్రశంసింపబడాలి అని ఈ కవచం చదవండి, మీకు ప్రశంసలు లభిస్తాయి. ఒకటి కాదు, సకల శుభాలూ కలిగిస్తుంది. భయంకర రోగాలు వచ్చినప్పుడు ఈ కవచమును పఠిస్తే ఆ వ్యాధులన్నీ తక్షణం నశించిపోతాయి. మన మీద ఎవరైనా ప్రయోగాలు, చేతబడులు చేసినా ఆ ప్రయోగాలన్నీ పటాపంచలైపోతాయి. ఈ భూమండలంలో ఇంత అత్యద్భుతమైన కవచం చాలా అరుదుగా ఉంటుంది, అని త్రిమూర్తులు చెప్పారు. అటువంటి ఈ గొప్ప కవచాన్ని పారాయణము చేసుకోండి లేదా వినండి, రెండిటి ఫలితమూ ఒకటే. శ్రీ దుర్గా సప్తశతి పారాయణం చేసేవారు, ఈ కవచం విన్న తరువాత లేదా పారాయణం చేసిన తరువాత సప్తశతిని పారాయణ చేస్తే మరింత శక్తివంతులవుతారు, అమ్మ అనుగ్రహం తొందరగా లభిస్తుంది.