కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 అక్టోబరు 06 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజ మాసము శుక్ల పక్షం
తిథి: చతుర్థి తె. 6.01 కు తదుపరి పంచమి పూర్తిగా ఉంది
వారం: భానువారము (ఆదివారం)
నక్షత్రం: విశాఖ రా. 9.58 కు తదుపరి అనూరాధ 07 రా. 11.36 కు
యోగం: విష్కంభ తె. 06.09 కు తదుపరి ప్రీతి 07 తె. 06.40 కు
కరణం: గరజి ఉ. 07.49 కు తదుపరి వణిజ సా. 08.51 కు
రాహుకాలం: సా. 04.30 - 06.00 కు
దుర్ముహూర్తం: మ. 04.26 - 05.13 కు
వర్జ్యం: రా. 2.14 - 3.56 కు
అమృతకాలం: మ. 12.26 - 2.10 కు
సూర్యోదయం: ఉ. 6.07 కు
సూర్యాస్తమయం: సా. 6.01 కు
🕉️ శరన్నవరాత్రులు 4వ రోజు- ఏలూరు శ్రీ ప్రణవపీఠంలో శ్రీ లలితాదేవి అలంకారం 🕉️
https://youtu.be/FS-o_aSJRd0?si=OlgzZ__v5AfEuXA_
గురుబోధ:
దుర్గానామం తనకు చాలా ఇష్టమని ఈ నామాన్ని నిత్యం భక్తితో జపించేవారికి గల కష్టాలన్నీ తత్ క్షణం తాను తొలగిస్తాననీ అమ్మవారు స్వయంగా లోపాముద్రకు చెప్పింది.
శ్లో|| దుర్గమాసుర హంత్రీత్వాత్ దుర్గేతి మమ నామ యః | - శ్రీ దేవీ భాగవతం - 7 వ స్కంధం; శ్లో|| 79, అధ్యాయం 28.
"శ్రీ దేవ్యధర్వశీర్షం" దుర్గా నామం దురాచారాలను నాశనం చేస్తుందనీ, సంసార సాగరాన్ని దాటిస్తుందనీ, అంత తేలికగా ఆ తల్లి గూర్చి మనం తెలుసుకోలేమనీ అంటోంది. ఒక్కసారి అమ్మవారి చూపు మనపై పడీ పడడంతోటే మనకు భవభీతి ఉండదనీ, భవం కూడా మధురమేననీ ఆదిశంకరులు అంటారు. దేవీనవరాత్రులలో దుర్గాపూజ చేసేటప్పుడు ఈ శ్లోకం చదువుతూ అమ్మవారిని ఎఱ్ఱని పూలతో పూజించిన వాడికి సకల దుఃఖాలు నశిస్తాయి.
శ్లో|| తాం దుర్గాం దుర్గమాం దేవీం, దురాచార విఘాతినీమ్ | నమామి భవభీతోహం సంసారార్ణవతారిణీమ్||