కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 అక్టోబరు 02 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసము కృష్ణ పక్షం
తిథి: అమావాస్య రా. 10.44 కు తదుపరి పాడ్యమి 03 రా. 12.47 కు
వారం: సౌమ్యవారము (బుధవారం)
నక్షత్రం: ఉత్తర మ. 12.22 కు తదుపరి హస్త 03 మ. 02.57 కు
యోగం: బ్రహ్మ రా. 03.22 కు తదుపరి ఐంద్ర 04 తె. 04.24 కు
కరణం: చతుష్పాద ఉ. 10.58 కు తదుపరి నాగ 03 రా. 12.18 కు
రాహుకాలం: మ. 12.00 - 01.30 కు
దుర్ముహూర్తం: ఉ. 11.41 - 12.29 కు
వర్జ్యం: రా. 9.40 - 11.26 కు
అమృతకాలం: ఉ. 6.11 కు
సూర్యోదయం: ఉ. 6.07 కు
సూర్యాస్తమయం: సా. 6.04 కు
🕉️ భాద్రపద అమావాస్య (మహాలయ అమావాస్య)🕉️
గురుబోధ:
పితృదేవతలను ఏమని కోరుకోవాలి? మా వంశం వృద్ధి చెందుగాక. మా వంశంలో దాతలు, వేదం చదువుకున్నవారు పెరుగు గాక, నీచులు పుట్టకుండా ఉండుగాక, మేము శ్రద్ధతో మంచి కార్యక్రమములు చేయుదుము గాక అని కోరుకోవాలి.
https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial