కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 సెప్టెంబరు 29 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసము కృష్ణ పక్షం
తిథి: ద్వాదశి సా. 5.37 కు తదుపరి త్రయోదశి 30 రా. 07.00 కు
వారం: భానువారము (ఆదివారం)
నక్షత్రం: ఆశ్లేష ఉ. 5.55 కు తదుపరి మఘ 30 ఉ. 5.55 కు
యోగం: సాధ్య రా. 12.28 కు తదుపరి శుభ 30 రా. 01.18 కు
కరణం: తైతుల సా. 04.47 కు తదుపరి గరజి 30 తె. 05.54 కు
రాహుకాలం: సా. 04.30 - 06.00 కు
దుర్ముహూర్తం: సా. 04.30 - 05.18 కు
వర్జ్యం: సా. 6.49 - 8.32 కు
అమృతకాలం: తె. 5.10 కు
సూర్యోదయం: ఉ. 6.06 కు
సూర్యాస్తమయం: సా. 6.06 కు
ఏకాదశీ ఉపవాసం ఉన్నవారు ద్వాదశీ పారణ ఈ రోజు చేయాలి.
గురుబోధ:
ప్రతి అమావాస్యకు, చనిపోయిన తమ పితరులు వారి ఇంటి గుమ్మం దగ్గర వచ్చి వారి పిల్లలు తర్పణాలు, పిండములు (వారికి జలము, ఆహారం) ఇస్తారేమో అని ఎదురు చూస్తారు. ఎంతో ఆకలితో ఎదురు చూస్తున్న వారికి మనం తర్పణాలు, పిండములు లేదా బ్రాహ్మణులకు స్వయంపాక దానము మొ౹౹ ఇవ్వకపోతే, ఇలాంటి పుత్రులను కన్నందుకు బాధపడి, ఆ వంశాన్ని, వారి పిల్లల్ని శపించి వెళ్ళిపోతారు. అదే వారికి తగిన తర్పణం, దానం మొ౹౹ ఇస్తే ఆకలి దాహం తీరిన వారు తృప్తితో వంశాన్ని ఆశీర్వదించి వెళ్లిపోతారు. వారి పిల్లలకు ఎటువంటి ఆపదలు రాకుండా రక్షిస్తారు. అందుకే చనిపోయిన వారి కోసం తర్పణాలు, దానాలు వంటివి చేసి తీరాలి.