Sep 08 2024సెప్టెంబరు 08 2024favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 సెప్టెంబరు 08 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసము శుక్ల పక్షం

తిథి: పంచమి మ. 3.35 కు తదుపరి షష్ఠి
వారం: భానువారము (ఆదివారం)
నక్షత్రం: స్వాతి మ. 12.47 కు తదుపరి విశాఖ
యోగం: ఐంద్ర రా. 12.05 కు తదుపరి వైధృతి
కరణం: బవ తె. 06.50 కు తదుపరి బాలవ
రాహుకాలం: సా. 04.30 - 06.00 కు
దుర్ముహూర్తం: మ. 04.45 - 05.35 కు
వర్జ్యం: సా. 6.50 - 8.34 కు
అమృతకాలం: తె. 5.14 - 6.44 కు
సూర్యోదయం: ఉ. 6.03 కు
సూర్యాస్తమయం: సా. 6.24 కు

🕉️ భాద్రపద శుద్ధ పంచమి, ఋషిపంచమి 🕉️

గురుబోధ
మానవులై‌ పుట్టాక ఋషుల ఋణం, దేవతల ఋణం, పితృదేవతల ఋణం ఈ ఋణాలన్నీ తీర్చుకోవాలి. అందులో ఋషుల యొక్క ఋణం తప్పక తీర్చుకోవాలి. ఈ రోజున మనం వీలున్నంతవరకు ఋషులు యొక్క పేర్లు తలుచుకోవాలి. పంచమినాడు ప్రొద్దుటే లేచి తలారా స్నానం చేసి కాసేపు విఘ్నేశ్వర ధ్యానం చేసాక సప్తఋషులను కౌండిన్యుడు, అత్రి, మరీచి మొదలైనటువంటి ఋషులను ముఖ్యంగా వ్యాసుడిని తప్పక తలచుకోవాలి. ఋషుల పేర్లు చెప్పి ఈ ఋషులు రాసినటువంటి పుస్తకాలు లోకంలో ప్రచారం చేస్తున్న మహానుభావులైనటువంటి గురువులందరినీ తలచుకోవాలి. గురుపూజ‌ చేయటం మంచిది. ఋషులవలె జీవితం సాగిస్తున్నటువంటి పౌరాణికులను ఈ రోజు పూజిస్తే సకల దేవతలు అనుగ్రహిస్తారు. ఋషిఋణం తీరుతుంది. ఋషి పంచమి నాడు సాయంత్రం వేళ శివాలయములో ప్రదక్షిణ చేసి శివుడ్ని దర్శనం చేసుకోవడం చాలా మంచిది. అందునా ప్రదోష కాలంలో శివదర్శనం చాలా మంచిది.

expand_less