Sep 07 2024సెప్టెంబరు 07 2024favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 సెప్టెంబరు 07 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసము శుక్ల పక్షం

తిథి: చతుర్థి మ. 1.51 కు తదుపరి పంచమి
వారం: స్థిరవారము (శనివారం)
నక్షత్రం: చిత్త ఉ. 10.27 కు తదుపరి స్వాతి
యోగం: బ్రహ్మ రా. 11.17 కు తదుపరి ఐంద్ర
కరణం: విష్టి మ. 05.37 కు తదుపరి బవ
రాహుకాలం: ఉ. 09.00 - 10.30 కు
దుర్ముహూర్తం: తె. 06.03 - 07.42 కు
వర్జ్యం: సా. 4.35 - 6.20 కు
అమృతకాలం: తె. 3.07 - 4.52 కు
సూర్యోదయం: ఉ. 6.03 కు
సూర్యాస్తమయం: సా. 6.25 కు

🕉️ వినాయక చతుర్థి, శ్రీ పాద శ్రీ వల్లభ స్వామి వారి జయంతి, తామస మన్వాది - భాద్రపద శుక్ల చతుర్థి, గణపతి నవరాత్రులు ప్రారంభం 🕉️

శ్రీ గణేశ సహస్ర నామ స్తోత్రం
https://youtu.be/EtyvpKuZCBk
కల్పవృక్షం, కామధేనువు, చింతామణి కంటే గొప్పది శ్రీ గణేశ సహస్రనామ స్తోత్రం. దీనిని సాక్షాత్తు ఈశ్వరుడు రచించాడు. విఘ్నాలను, ఆటంకాలను, భయంకరమైన రోగాలను తొలగించి అనుకున్న కార్యక్రమాలలో విజయాన్ని ప్రసాదిస్తుంది. ఇళ్ళు కట్టుకోవాలనుకున్నప్పుడు, శత్రువులపై విజయం పొందడం కోసం, ఆర్థిక ఇబ్బందులు తొలగడం కోసం, ఇతరులకు మనం అప్పు ఇచ్చినప్పుడు, ఆ అప్పు తిరిగి రావడానికి, ఇతరుల దగ్గర మనం తీసుకున్న అప్పు తీర్చడానికి ఈ స్తోత్రాన్ని భక్తిశ్రద్ధలతో పారాయణం చేసినా, విన్నా ఎంతో మంచిది.

శ్రీ సంకటనాశన గణేశ స్తోత్రం👇
https://youtu.be/vyjRR5ng2tQ?si=Jw2fe6AbaP2gtVmD

గురుబోధ
గణేశచతుర్థి నాడు చేయవలసిన కొన్ని ముఖ్యమైనవి:
1) ఈ తిథి నాడు ఉదయమే లేచి తలారా స్నానము చేసి సంధ్యావందనాది కార్యక్రమాలు చేసి ఆ తరువాత మట్టితోటి విఘ్నేశ్వరుడి యొక్క ప్రతిమను చేయండి. మట్టి ప్రతిమను పూజించాలి అని పదేపదే మన పురాణాలు చెపుతున్నాయి.
2) అందులోకి విఘ్నేశ్వరుడిని ఆవాహన చేయాలి. పెద్ద పెద్ద విగ్రహాలు ఎన్ని. పెట్టినా తప్పనిసరిగా చిన్న ప్రతిమ ఉండాలి. నిమజ్జనం చేసేటప్పుడు ఎన్ని రకాల ప్రతిమలు ఉన్నప్పటికీ మట్టి బొమ్మ లేకపోతే ఆ‌ నిమజ్జనం వ్యర్థమైపోతుంది.
3) విఘ్నేశ్వరుడు మోదకప్రియుడు. మోదకము అంటే లడ్డు. ఉత్తర్ భారత్ వాళ్ళు తీపి లడ్డూలు తయారు చేస్తారు. మోదకము అంటే ఆవిరితో తయారు అయినటువంటి బియ్యపురవ్వతో తయారు చేసిన కుడుములను కూడా మోదకములు అంటారు. మన తెలుగు వాళ్ళు కుడుములు పెడతారు. రెండూ శాస్త్రమే. కుడుములు నివేదన చేసి ప్రసాదంగా తినాలి.
3) కథాక్షతలు వేసుకోవాలి. కథ వింటున్నప్పుడు చేతిలో అక్షతలు ఉంచుకోవాలి. కథ అయ్యాక విగ్రహం దగ్గర వేసి అక్షతలు నెత్తి మీద వేసుకోవాలి. అలా అక్షతలు వేసుకోకుండా చంద్రుడిని చూస్తే నీలాపనిందలు వస్తాయి.
5) విఘ్నేశ్వరుడి పూజలో ప్రత్యేకత ఏమిటంటే మనకి మనమే మొట్టికాయలు వేసుకుంటే మహాపాపాలు అన్నీ తొలగిపోతాయి. ఆయనకి ప్రదక్షిణ చేస్తే భూప్రదక్షిణ చేసిన మహాఫలితం వస్తుంది.
6) ఒక పుస్తకం కానీ, పలక కానీ దాని మీద 'ఓం' కారం రాసి విఘ్నేశ్వరుడి దగ్గర పెట్టి పుస్తకాలు వాడుకుంటే చదువు బాగా పెరుగుతుంది. విఘ్నేశ్వరుడి గురించి "భక్తి ప్రియో గణేశః" అని శివపురాణం చెపుతున్నది. భక్తి అంటే ఆయనకి చాలా ఇష్టం. అత్యంత భక్తిశ్రద్ధలతో విఘ్నేశ్వరుడిని పూజించి కథ అక్షతలు శిరస్సున వేసుకుంటే ఆ సంవత్సరమంతా విఘ్నాలు నుంచి బయటపడతాము.

expand_less