కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఆగష్టు 29 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసము కృష్ణ పక్షం
తిథి: ఏకాదశి 30 తె. 3.44 కు తదుపరి ద్వాదశి
వారం: బృహస్పతివారము (గురువారం)
నక్షత్రం: ఆర్ద్ర రా. 8.02 కు తదుపరి పునర్వసు
యోగం: సిద్ధి సా. 06.18 కు తదుపరి వ్యతీపాత
కరణం: బవ మ. 01.24 కు తదుపరి బాలవ
రాహుకాలం: మ. 01.30 - 03.00 కు
దుర్ముహూర్తం: ఉ. 10.12 - 11.02 కు & మ. 03.12 - 04.02 కు
వర్జ్యం: లేదు
అమృతకాలం: ఉ. 9.57 - 11.33 కు
సూర్యోదయం: ఉ. 6.02 కు
సూర్యాస్తమయం: సా. 6.32 కు
ఏకాదశీ ఉపవాసం ఈ రోజు ఉండాలి. ఏకాదశీ ఉపవాసం ఉన్నవారు ద్వాదశీ పారణ రేపు చేయాలి.
శ్రీ వాసుదేవ శత నామాలు👇
https://youtu.be/DpjBm71jA_s?si=P3uhz2umkoo8lmNX
🕉️👉శ్రావణ కృష్ణ ఏకాదశి, కామిక ఏకాదశి👈🕉️
గురుబోధ:
🕉️విష్ణువును భక్తితో, అష్టోత్తరశతనామములతో కానీ, విష్ణుసహస్రనామముతో కానీ పూజించాలి.
🕉️కలియుగములో కటిక ఉపవాసము నిషిద్ధము కనుక శరీరము నిలబడుటకు కావలసిన రీతిలో పండుకానీ, పాలు కానీ, అల్పాహారం తీసుకుని ఉపవాసం చేయండి.
🕉️కామిక ఏకాదశి నాడు యథాశక్తి తప్పక భాగవతమును పారాయణ చేయండి. అలా చేసిన వారికి తప్పకుండా ఇహము, పరము రెండూ లాభిస్తాయి.
🕉️మరునాడు ద్వాదశి ఘడియలలో స్నానానంతరము యథాశక్తి దానధర్మాలు చేసుకుని భోజనం చేయాలి. అనుకున్న కోరికలను తీర్చి, ఐశ్వర్యాన్ని ప్రసాదించే దివ్య తిథి ఈ కామిక ఏకాదశి. ఈ ఉపవాస వ్రతము చేసే వాళ్ళు అన్నదానము చేస్తే మరింత ఫలితం వస్తుంది.