కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఆగష్టు 19 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసము శుక్ల పక్షం
తిథి: పూర్ణిమ రా. 12.43 కు తదుపరి పాడ్యమి
వారం: ఇందువారము (సోమవారం)
నక్షత్రం: శ్రవణం ఉ. 9.04 కు తదుపరి ధనిష్ఠ
యోగం: శోభన 00.47 కు తదుపరి అతిగండ
కరణం: విష్టి మ. 01.32 కు తదుపరి బవ
రాహుకాలం: ఉ. 07.30 - 09.00 కు
దుర్ముహూర్తం: మ. 12.45 - 01.35 కు & మ. 03.17 - 04.07 కు
వర్జ్యం: మ. 12.52 - 2.24 కు
అమృతకాలం: రా. 10.00 - 11.31 కు
సూర్యోదయం: ఉ. 6.00 కు
సూర్యాస్తమయం: సా. 6.39 కు
🕉️ హయగ్రీవ జయంతి, రాఖీ పండుగ, విఖనస మహర్షి జయంతి, ఋగ్వేద యజుర్వేద ఉపాకర్మ, జంధ్యాల పూర్ణిమ🕉️
https://youtu.be/lTSHPx0nocQ?si=bJIC1j4aUBujtCjG
గురుబోధ
శ్రావణపూర్ణిమ (జంధ్యాల పూర్ణిమ) నాడు జంధ్యం ధరించే ఆచారం ఉన్నవారు తప్పక పురోహితుని లేదా ఆచార్యుని సన్నిధిలో శాస్త్రోక్తంగా నూతనయజ్ఞోపవీతం ధరించాలని శాస్త్రం. ఏడాది మొత్తం మైల, అశౌచం సమయంలో తెలిసీ తెలియక చేసిన పాపములను మరియు సంధ్యావందనం సరైన సమయంలో చేయకపోవడం వల్ల వచ్చే పాపములను ప్రాయశ్చిత్తం ద్వారా తొలగించుకోవచ్చు.
ఉపాకర్మ! August 19 (సోమవారం) శ్రావణపూర్ణిమ( జంధ్యాల పూర్ణిమ) యజుర్వేద, ఋగ్వేద ఉపాకర్మ
1. ఉపాకర్మ ఎందుకు ?
★నిత్య కర్మానుష్ఠానము (త్రికాల సంధ్యావందనం, అగ్నికార్యం, తర్పణం) జంధ్యం ధరించిన ప్రతివారు చేయవల్సిందే. కొన్ని అనివార్య కారణాల వల్ల ఇవి చేయలేకపోయినప్పుడు ఆ సంవత్సరంలో జరిగిన దోషాల ప్రాయశ్చితార్థం తప్పక ఈ ఉపాకర్మను ఆచరించాలి. మరియు శౌచం పాటించక వచ్చిన దోషాలను, మైల ఉన్నవారిని తాకడంవలన వచ్చే దోషాలను కూడా ఉపాకర్మ ద్వారా తొలగించుకోవచ్చు.
2. ఏ వేదం వారు ఎప్పుడు ఆచరిస్తారు?
★ఋగ్వేదం - శ్రవణానక్షత్రం (శ్రావణ మాసం, శుక్లపక్షము)
యజుర్వేదం - శ్రావణ పూర్ణిమ
సామవేదం - హస్తానక్షత్రము
3. శ్రావణమాసం లో నూతన యజ్ఞోపవీతాన్ని ధరించకపోతే నిత్యకర్మానుష్ఠానమునకు పనికిరాదా ?
★ అవును. ఖచ్చితంగా పనికిరాదు.
4. ఉపాకర్మ ఏవిధంగా చేస్తారు ? క్లుప్తంగా చెప్పండి.
★ఋషిపూజ, తర్పణం, విరజాహోమం, యజ్ఞోపవీత ధారణం, బ్రహ్మయజ్ఞం. పంచగవ్య ప్రాశనతో శరీరశుద్ధి మొదలగునవి.
ముఖ్యంగా ప్రజాపతి, సోముడు, అగ్ని, విశ్వేదేవతలు మొదలుగా గల 9 మంది ఋషులను దర్భలో ఆవాహనం చేసి పూజచేస్తారు.
◆జంధ్యం ధరించే ప్రతివారు తప్పక ఈరోజు పురోహితుని లేదా ఆచార్యుని సన్నిధిలో శాస్త్రోక్తంగా నూతనయజ్ఞోపవీతం ధరించాలి◆ ప్రస్తుత పరిస్థితులలో ఇవన్నీ కుదరకపోయినా కనీసం తప్పక నూతనయజ్ఞోపవీతం ధరించాలి.