కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఆగష్టు 16 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసము శుక్ల పక్షం
తిథి: ద్వాదశి 17 తె. 5.09 కు తదుపరి త్రయోదశి
వారం: భృగువారము (శుక్రవారం)
నక్షత్రం: మూల ఉ. 10.22 కు తదుపరి పూర్వాషాఢ
యోగం: విష్కంభ మ. 01.12 కు తదుపరి ప్రీతి
కరణం: విష్టి ఉ. 08.39 కు తదుపరి బవ
రాహుకాలం: ఉ. 10.30 - 12.00 కు
దుర్ముహూర్తం: ఉ. 08.32 - 09.23 కు & మ. 12.46 - 01.36 కు
వర్జ్యం: ఉ. 8.44-10.22 కు & రా. 7.57 - 9.33 కు
అమృతకాలం: తె. 5.24 - 6.54 కు
సూర్యోదయం: ఉ. 5.59 కు
సూర్యాస్తమయం: సా. 6.41 కు
👉🕉️ శ్రావణ శుక్రవారం, వరలక్ష్మీ వ్రతం 🕉️👈
ఏకాదశీ ఉపవాసం ఉన్నవారు ద్వాదశీ పారణ ఈ రోజు చేయాలి.
గురుబోధ:
శ్రావణమాస పూర్ణిమకి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీ వ్రతం. భృగుమహర్షికి, ఖ్యాతికి శ్రావణమాస పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు లక్ష్మీదేవి జన్మించింది. వరములిచ్చి లక్ష్మీదేవి జన్మించడం వలన వరలక్ష్మి అనే పేరు వచ్చింది. భృగుమహర్షి శ్రావణమాస శుక్ల పక్ష పూర్ణిమకి ముందు వచ్చే శుక్రవారంనాడే అమ్మను విష్ణువుకిచ్చి వివాహం చేసాడు. వివాహానంతరం సాయంత్రం లక్ష్మీనారాయణులను ప్రత్యక్షంగా ఆసనంపై కూర్చోబెట్టి వరలక్ష్మీవ్రతం ఆచరించాడు.
వరలక్ష్మీవ్రతం రోజున చేయవలసిన విధివిధానాలలో కొన్ని:
🕉️సాయంత్రంవేళ లక్ష్మీదేవి గుడిలో ప్రదక్షిణలు చేయాలి.
🕉️లక్ష్మీనారాయణులు గురుదంపతుల రూపంలో ఉంటారు. గురుదంపతులను పూజించి ప్రదక్షిణ చేయాలి. కుదరని వారు కనీసం గురువుల పటం పెట్టుకుని పూజించాలి.
🕉️అమ్మవారిని పసుపు కొమ్ములతో అర్చించాలి. శ్రీ సూక్తం పారాయణ తప్పకుండా చేయాలి, లేదా వినాలి.
🕉️అమ్మవారిని అష్టోత్తరశతనామాలతో, బిల్వపత్రాలతో పూజించాలి. ఇలా చేయడం వలన సంపదలకు లోటు ఉండదు.
🕉️శక్తిని అనుసరించి సువర్ణ, రజత దానాలు చేయాలి. అన్నదానం చేయాలి. కప్పుకోవటానికి పనికివచ్చే దుప్పటి కానీ, శాలువా కానీ మహానుభావులైన గురువులకు దానం చేస్తే, భార్యాభర్తలు ఎప్పుడుా ఐకమత్యంతో జీవిస్తారు.
🕉️ఈ వ్రతమును పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం ఆచరించలేకపోతే, చివరి శుక్రవారం చేసుకోవచ్చు.
🕉️సంపదలు అనగా ఒక్క ధనము మాత్రమే కాదు; సంతానం, ఆరోగ్యం, విద్య తదితరులు కూడా.
ఇంద్రకృత లక్ష్మీస్తోత్రం👇
https://youtu.be/if5zzw20GaQ?si=1n_Qt4ZGMZmnxiab
శ్రీ వ్యూహలక్ష్మీదేవి మంత్ర వైశిష్ట్యం👇
https://youtu.be/JGt7-hnqUHI?si=JA--lUzse0n2MbLx