Aug 09 2024ఆగష్టు 09 2024favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఆగష్టు 09 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసము శుక్ల పక్షం

తిథి: పంచమి రా. 11.50 కు తదుపరి షష్ఠి
వారం: భృగువారము (శుక్రవారం)
నక్షత్రం: హస్త రా. 12.46 కు తదుపరి చిత్త
యోగం: సిద్ధ మ. 01.46 కు తదుపరి సాధ్య
కరణం: బవ మ. 01.55 కు తదుపరి బాలవ
రాహుకాలం: ఉ. 10.30 - 12.00 కు
దుర్ముహూర్తం: ఉ. 08.31 - 09.22 కు & మ. 12.47 - 01.38 కు
వర్జ్యం: ఉ. 7.28 - 9.15 కు
అమృతకాలం: సా. 6.07 - 7.53 కు
సూర్యోదయం: ఉ. 5.58 కు
సూర్యాస్తమయం: సా. 6.45 కు

👉🕉️ గరుడ పంచమి/నాగ పంచమి 🕉️ శృంగేరీ జగద్గురువులు శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతీస్వామి వారి జన్మతిథి, శ్రావణ శుక్రవారం👈

గురుబోధ:
శ్రావణశుక్ల పంచమిని నాగపంచమి అంటారు. పూర్వం నాగజాతి ప్రముఖులైన వాసుకి తదితర నాగులకు మరియు గరుత్మంతునికి శ్రావణమాస శుక్లపక్షం పంచమీ తిథి నాడు ఒక ఒప్పందం కుదిరింది. ఈ తిథినే గరుడపంచమి అని పిలుస్తారు. శ్రీ మహావిష్ణువు శ్రావణ శుక్ల పంచమి నాడు గరుత్మంతుని నామాలను తలుచుకొని పానకం నివేదించాలని, నాగ దేవతలకు కూడా చిమ్మిలి, చలివిడి నివేదించాలని వరమిచ్చాడు. ఇలా చేయడం వల్ల నాగదోషాలు, నాగబాధలు, పక్షి దోషాలు, అపశకునం, పక్షుల వల్ల కలిగే దోషాలు పోతాయి అని వరం ఇచ్చాడు. ఈ రోజున ఇంటి తలుపులకు (సింహ ద్వారమునకు) రెండు వైపులా ఆవు పేడతో సర్పాలను తయారు చేసి, అనగా పేడతో పాముల బొమ్మలు చేసి, పెరుగు, గరిక, అక్షతలు, దర్భలు,గంధం, పూలు, మున్నగు వాటితో ఆ ప్రతిమలను పూజించి, విప్రులకు సంతర్పణ చేయాలి. ఇలా చేసిన వారికి నాగదోషాలు తొలగి, సత్సంతానం కలుగుతుందని భవిష్యపురాణంలోని 36వ అధ్యాయంలో వ్యాసులవారు వివరించారు.

నాగ దోష పరిహార స్తోత్రం
https://youtu.be/bB-00LLmyRQ

expand_less