కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఆగష్టు 06 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసము శుక్ల పక్షం
తిథి: విదియ సా. 6.12 కు తదుపరి తదియ
వారం: భౌమవారము (మంగళవారం)
నక్షత్రం: మఘ సా. 5.19 కు తదుపరి పుబ్బ
యోగం: వరీయాన్ ఉ. 11.00 కు తదుపరి పరిఘ
కరణం: బాలవ తె. 06.54 కు తదుపరి కౌలవ
రాహుకాలం: మ. 03.00 - 04.30 కు
దుర్ముహూర్తం: ఉ. 08.31 - 09.22 కు & రా. 11.15 - 12.00 కు
వర్జ్యం: తె. 4.33 - 6.03 కు & రా. 2.05 - 3.50 కు
అమృతకాలం: మ. 2.41 - 4.24 కు
సూర్యోదయం: ఉ. 5.57 కు
సూర్యాస్తమయం: సా. 6.47 కు
👉🕉️ శ్రావణశుక్ల ద్వితీయ, శ్రావణమంగళగౌరీ వ్రతము 🕉️👈
గురుబోధ:
శ్రావణశుక్ల ద్వితీయకు అశోకశయనతిథి అని పేరు. శ్రీమహావిష్ణువు అవతారములలో "విశ్వకర్మ" అనే ప్రజాపతి అవతారము కూడా ఒకటి. విశ్వకర్మ భగవానుడు సృష్టిని చేసి తన దివ్యశక్తితో కలిసి ఈ తిథియందు శయనిస్తాడు. శయనకాలంలో ఆయన నాలుగు శిరస్సులతో ఉంటాడు. ఆ జగత్పతికి నమస్కరించి ఈ క్రింది శ్లోకమంత్రం పఠిస్తే బ్రహ్మపదవి, బ్రహ్మజ్ఞానం లభిస్తాయి.
శ్లో|| శ్రీవత్సధారిన్ శ్రీ కాంత శ్రీ వాస శ్రీ పతే ప్రభో!
గార్హస్థ్యం మా ప్రణాశం మే యాతు ధర్మార్థ కామద!!
ఈ శ్లోక పారాయణ వల్ల దాంపత్యజీవనం హాయిగా సాగుతుంది.