Aug 02 2024ఆగష్టు 02 2024favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఆగష్టు 02 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసము కృష్ణ పక్షం

తిథి: త్రయోదశి మ. 3.42 కు తదుపరి చతుర్దశి
వారం: భృగువారము (శుక్రవారం)
నక్షత్రం: ఆర్ద్ర మ. 12.18 కు తదుపరి పునర్వసు
యోగం: హర్షణ ఉ. 11.45 కు తదుపరి వజ్ర
కరణం: వణిజ మ. 03.26 కు తదుపరి విష్టి
రాహుకాలం: ఉ. 10.30 - 12.00 కు
దుర్ముహూర్తం: ఉ. 08.30 - 09.22 కు & మ. 12.48 - 01.40 కు
వర్జ్యం: రా. 12.32 - 2.10 కు
అమృతకాలం: లేదు
సూర్యోదయం: ఉ. 5.56 కు
సూర్యాస్తమయం: సా. 6.49 కు

👉🕉️ మాసశివరాత్రి 🕉️👈

శివసహస్రనామ స్తోత్రమ్👇
https://youtu.be/AcS0VMMx3lU?si=XBKdVWZSit6nW-ha

గురుబోధ:
మారేడుచెట్టు శివుని స్వరూపమే. శివునికీ, బిల్వవృక్షానికీ తేడా లేదు. అందుకే దేవతలు కూడా ఈ చెట్టును అతి భక్తితో స్తుతిస్తారు. ఈ చరాచర జగత్తులో ప్రసిద్ధికెక్కిన ఎన్ని పుణ్యతీర్థాలున్నాయో అవన్నీ మారేడుచెట్టు మూలంలో (వ్రేళ్ళలో) ఉంటాయి. మారేడుచెట్టు మూలంలో లింగం ఒకదానిని కాని లేదా అనేక లింగాలను కాని ఉంచి పూజించినవాడు పరమ పుణ్యాత్ముడౌతాడు. శివుని సన్నిధిని పొందగలుగుతాడు. మారేడుచెట్టు క్రింద స్నానం చేసినవాడు, సమస్త పుణ్యతీర్థాలలో స్నానం చేసిన మహాఫలం పొంది, పవిత్రుడౌతాడు. గంధపుష్పాదులతో మారేడుచెట్టు మొదలును పూజించినవాడు శివలోకంలో శాశ్వతంగా ఉండగలుగుతాడు. మారేడుచెట్టు దగ్గర దీపం వెలిగించిన పుణ్యాత్ముడు, తత్త్వజ్ఞానం పొందుతాడు. శరీరం విడిచిపెట్టాక శివుడిలో ఐక్యం అవుతాడు. అందునా, కార్తికమాసంలోనూ, మాఘమాసంలోనూ, ప్రతి మాసశివరాత్రికీ, మారేడు దగ్గర ఆవునేతిదీపం వెలిగించిన వాడికి ఈ జన్మలోనే కైవల్యం లభిస్తుంది. మారేడుకొమ్మ చేతితో పట్టుకుని, మారేడుచెట్టును పూజించి, ఆ కొమ్మను శివునికి సమర్పించేవాడు సకలపాప విముక్తుడౌతాడు. మారేడుచెట్టు క్రింద ఒక్క శివభక్తునకు భోజనం పెట్టినా, కోటిమంది భక్తులకు పెట్టిన పుణ్యం లభిస్తుంది. మారేడుచెట్టు క్రింద పాలతో కూడిన అన్నంలో నేయి కలిపి (అనగా నేయి వేసిన పాయసం) శివభక్తులకు పెట్టినవాడు దారిద్ర్యం నుండి విముక్తుడై సకల సంపదలు పొందుతాడు.
expand_less