July 27 2024జులై 27 2024favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జులై 27 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసము కృష్ణ పక్షం

తిథి: సప్తమి రా. 1.04 కు తదుపరి అష్టమి
వారం: స్థిరవారము (శనివారం)
నక్షత్రం: రేవతి సా. 5.27 కు తదుపరి అశ్విని
యోగం: ధృతి రా. 10.44 కు తదుపరి శూల
కరణం: విష్టి ఉ. 10.22 కు తదుపరి బవ
రాహుకాలం: ఉ. 09.00 - 10.30 కు
దుర్ముహూర్తం: తె. 05.54 - 07.38 కు
వర్జ్యం: ఉ. 6.15 - 7.45 కు
అమృతకాలం: మ. 3.12 - 4.41 కు
సూర్యోదయం: ఉ. 5.54 కు
సూర్యాస్తమయం: సా. 6.51 కు

గురుబోధ:
ఈ భూమి మీద పుట్టిన వారందరూ ఏదో ఒక కారణం చేత పుట్టారు. అందరూ కారణజన్ములే. ఎవరూ తక్కువ కాదు! ఎవరూ ఎక్కువ కాదు! ఆఖరికి ఒక పిచ్చి మొక్క కూడా ఏదో ఒక కారణం చేత భగవంతుడి ద్వారా సృష్టింపబడింది. అందుకే గడ్డిపరకను కూడా తృణముగా భావించకూడదంటారు. అటువంటిది భగవంతుడిని మనము అనుక్షణం అత్యంత జాగరూకులమై పట్టుకోవాలి. ఇక్కడ ఉండగా మనము అహంకరిస్తే మనము చేసినటువంటి పొరపాటుకు ఎక్కడో అక్కడ శిక్షను అనుభవించాలి. శిక్ష అనుభవించే కంటే అసలు పొరపాటే చేయకుండా ఉందామా! అనుకుంటే అలా ఉండడం కుదరదు. అన్నం తింటే అజీర్తి కలుగుతుందని, అసలు అన్నమే తినకుండా ఉండలేం కదా! చేసే పనిలో జాగ్రత్త వహించాలి కానీ అసలు పనే చేయకుండా ఉండకూడదు. చేసే కర్మల వల్ల ఫలితాలను అనుభవించాల్సి వస్తుందని కర్మలనే విడిచిపెట్టడం సమంజసం కాదు. - శ్రీమద్భాగవతం

expand_less