కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జులై 21 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసము శుక్ల పక్షం
తిథి: పూర్ణిమ సా. 4.12 కు తదుపరి పాడ్యమి
వారం: భానువారము (ఆదివారం)
నక్షత్రం: ఉత్తరాషాఢ రా. 1.52 కు తదుపరి శ్రవణం
యోగం: విష్కంభ రా. 09.11 కు తదుపరి ప్రీతి
కరణం: బవ మ. 03.46 కు తదుపరి బాలవ
రాహుకాలం: సా. 04.30 - 06.00 కు
దుర్ముహూర్తం: మ. 05.09 - 06.01 కు
వర్జ్యం: తె. 5.43 - 7.13 కు & ఉ. 10.14 - 11.47 కు
అమృతకాలం: రా. 7.41 - 9.14 కు
సూర్యోదయం: ఉ. 5.52 కు
సూర్యాస్తమయం: సా. 6.53 కు
👉🕉️ ఆషాఢపూర్ణిమ, వ్యాసపూర్ణిమ, గురుపూర్ణిమ🕉️👈
గురుబోధ:
వ్యాసో నారాయణో హరిః అని సమస్త జగత్తూ ఆయన్ని కీర్తించింది. శ్రీ మన్నారాయణుడు భూమి మీద ఎత్తిన 22 అవతారములలో ఒక దివ్యావతారము వ్యాసావతారం. సత్యవతికి, పరాశరుడికి వ్యాసుడు ఆషాఢ మాసంలో పూర్ణిమ నాడు సరిగ్గా మధ్యాహ్నం సమయంలో ఇంచుమించు గా 11.30 కి అవిర్భవించినట్టుగా పురాణాలు చెబుతున్నాయి. వేదములను విభజించి, అష్టాదశపురాణాలు, ఉపపురాణాలు, సమస్త ధర్మాలు, బ్రహ్మసూత్రాలు అందించిన శ్రీ వేదవ్యాస మహర్షి జన్మించిన రోజు ఆషాఢపూర్ణిమ. ఆ మహానుభావుడి జన్మతిథిని గురుపూర్ణిమగా జరుపుకుంటూ వ్యాసుడిని గురువులరూపంలో పూజించించుకోవడం అనాదిగా వస్తున్న మన సత్సంప్రదాయం. త్రిమూర్తి స్వరూపమైన గురువు అనుగ్రహిస్తే యోగులు కూడా పొందలేని వైకుంఠమును తక్షణం ఈ జన్మలోనే పొందవచ్చు. అందువల్లే
🕉️గురువుని తప్పక పూజించాలి. తమ గురువే వ్యాసులనుకోవాలి. వ్యాసభగవానుడి అష్టోత్తరం చదువుకోవాలి.
🕉️ఈ పూట ఎంత ఎక్కువగా గురునామస్మరణ చేస్తే జీవితంలో అంత ఎక్కువ శుభాలు పొందుతారు.
🕉️మనం ఎక్కడ ఉన్నా తప్పకుండా గురువుని ధ్యానించాలి, కుదిరితే గురువుని దర్శించి సేవచేసి, ప్రదక్షిణ చేసి యథాశక్తిన దక్షిణ సమర్పించాలి.
🕉️గురువులకి దూరంగా ఉన్నవారు ఇంట్లోనే కూర్చుని యథాశక్తిగా గురువుని అర్చించాలి.
🕉️అమ్మవారి దగ్గర ఉన్న చింతామణి ఇచ్చేటటువంటి శుభాలు పొందాలంటే గురువు పాదాలు పట్టుకోవాలి.
వేదవ్యాస వైశిష్ట్యం👇
https://youtu.be/FhbzIfYiepc?si=8ZTdDlpodnUOGym9
వేదవ్యాస అష్టోత్తర శతనామావళి👇
https://srivaddipartipadmakar.org/stotram/sri-vedavyasa-ashtottara-satanamavali/
https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial
జూలై 21 నుండి ఆగష్టు 19 వరకు పూజ్య గురువులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారిచే శ్రీ స్కాంద పురాణం ప్రవచనం శృంగేరి శారదా పీఠం(సంపత్ నగర్), గుంటూరు లో సాయంత్రం 6 నుండి 8 వరకు జరుగుతున్నది