July 19 2024జులై 19 2024favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జులై 19 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసము శుక్ల పక్షం

తిథి: త్రయోదశి సా. 6.01 కు తదుపరి చతుర్దశి
వారం: భృగువారము (శుక్రవారం)
నక్షత్రం: మూల రా. 2.31 కు తదుపరి పూర్వాషాఢ
యోగం: ఐంద్ర రా. 02.41 కు తదుపరి వైధృతి
కరణం: కౌలవ ఉ. 08.18 కు తదుపరి తైతుల
రాహుకాలం: ఉ. 10.30 - 12.00 కు
దుర్ముహూర్తం: ఉ. 08.28 - 09.20 కు & మ. 12.49 - 01.41 కు
వర్జ్యం: ఉ. 10.16-11.53 కు & రా. 12.53 - 2.31 కు
అమృతకాలం: రా. 8.07 - 9.44 కు
సూర్యోదయం: ఉ. 5.51 కు
సూర్యాస్తమయం: సా. 6.53 కు

👉🕉️ ప్రదోషం, ఏలూరు శ్రీ ప్రణవపీఠంలో శాకంభరిగా అమ్మవారికి అలంకారం 🕉️👈

గురుబోధ:
ఉదయం పూట, మధ్యాహ్నానికి కొంచెం ముందు శివలింగ దర్శనం అత్యంత శుభప్రదం. సూర్యోదయానికి ముందు 20ని.లు, సూర్యాస్తమయం తరువాత 20 ని.లు ఈ కాలాన్ని ప్రదోషకాలము అంటారు. ఆ సమయంలో శివదర్శనం, శివారాధన, శివ పూజ, శివాభిషేకము, జపము చాలా విశేషమైనది, చేసుకొన్నవాడికి పునర్జన్మ ఉండదు. శివాలయంలో శివలింగం బయట కాని ఆలయ గోపురంపై కాని శివవిగ్రహం ఉంటే, ఆ ఆలయంలో పూజాదికాలు నిర్వహించినవారికి శివపదం వస్తుంది. శివలింగం యొక్క పీఠం లేక పానవట్టం అమ్మవారు. శివలింగం చేతనాత్మకమైన శివస్వరూపం. పానవట్టంతో కూడిన శివలింగం పార్వతీపరమేశ్వరుల ఐక్యరూపం.

👉పూజ్య గురుదేవులు, అభినవశుక, ప్రవచననిధి బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారిచే "శ్రీ కనకదుర్గాదేవి మహిమ" ప్రవచనామృతం రెండురోజులు జూలై 19, 20 వ తేదీలలో, విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో, సా.6గం.ల నుండి 8గం.ల వరకు👈

expand_less