కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జూన్ 29 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసము కృష్ణ పక్షం
తిథి: అష్టమి మ. 3.44 కు తదుపరి నవమి
వారం: స్థిరవారము (శనివారం)
నక్షత్రం: ఉత్తరాభాద్ర ఉ. 10.48 కు తదుపరి రేవతి
యోగం: శోభన సా. 06.54 కు తదుపరి అతిగండ
కరణం: కౌలవ మ. 02.19 కు తదుపరి తైతుల
రాహుకాలం: ఉ. 09.00 - 10.30 కు
దుర్ముహూర్తం: తె. 05.45 - 07.30 కు
వర్జ్యం: రా. 9.59 - 11.28 కు
అమృతకాలం: ఉ. 6.20 - 7.49 కు
సూర్యోదయం: ఉ. 5.45 కు
సూర్యాస్తమయం: సా. 6.54 కు
గురుబోధ:
అన్నమును భోజనం చేసే వారు కూర్చున్నాకే వడ్డించాలి. ఇతర పదార్థాలు ముందే వడ్డించుకోవచ్చు. భోజనం చేస్తూ మధ్యలో లేవకూడదు. భోజనం చేసే ముందు భోజనం అయ్యాక తప్పక కాళ్ళను కడుక్కోవాలి. కాళ్ళు కడగడం కుదరనప్పుడు తప్పక రెండు చేతులను అయినా కడుక్కోవాలి.