కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జూన్ 26 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసము కృష్ణ పక్షం
తిథి: పంచమి రా. 11.08 కు తదుపరి షష్ఠి
వారం: సౌమ్యవారము (బుధవారం)
నక్షత్రం: ధనిష్ఠ మ. 3.50 కు తదుపరి శతభిషం
యోగం: విష్కంభ తె. 06.14 కు తదుపరి ప్రీతి
కరణం: కౌలవ ఉ. 10.03 కు తదుపరి తైతుల
రాహుకాలం: మ. 12.00 - 01.30 కు
దుర్ముహూర్తం: ఉ. 11.53 - 12.45 కు
వర్జ్యం: రా. 10.31 - 12.00 కు
అమృతకాలం: ఉ. 5.38 - 7.08 కు
సూర్యోదయం: ఉ. 5.44 కు
సూర్యాస్తమయం: సా. 6.54 కు
గురుబోధ:
ఏదో ఒక భగవత్ సాధన చేసి దేవతా అనుగ్రహం పొందాలి. సాధనలో పురాణశ్రవణం, మంత్ర జపం, నామ జపం, భజన, భగవత్ పూజ, పారాయణం లేదా భగవత్ సేవ మొ౹౹ ఉత్తమమైనవి.