కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జూన్ 14 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసము శుక్ల పక్షం
తిథి: అష్టమి రా. 10.53 కు తదుపరి నవమి
వారం: భృగువారము (శుక్రవారం)
నక్షత్రం: ఉత్తర పూర్తి
యోగం: సిద్ధి రా. 07.08 కు తదుపరి వ్యతీపాత
కరణం: విష్టి ఉ. 10.47 కు తదుపరి బవ
రాహుకాలం: ఉ. 10.30 - 12.00 కు
దుర్ముహూర్తం: ఉ. 08.20 - 09.12 కు & మ. 12.43 - 01.36 కు
వర్జ్యం: మ. 12.56 - 2.42 కు
అమృతకాలం: రా. 11.32 - 1.18 కు
సూర్యోదయం: ఉ. 5.42 కు
సూర్యాస్తమయం: సా. 6.51 కు
గురుబోధ:
జ్యేష్ఠ శుక్ల అష్టమి - జ్యేష్ఠమాసంలో శుక్లపక్షంలో వచ్చే అష్టమి శని దేవుడికి, కాలభైరవునికి ప్రీతిపాత్రమైనది. ఈ రోజు చేయవలసిన విధి విధానాలు: 1) శివ పంచాక్షరి కానీ శనీశ్వర స్తోత్రం గాని చదువుకోవాలి. 2) శివాలయంలో గాని, నవగ్రహ ఆలయంలో గాని నువ్వుల నూనెతో దీపారాధన చెయ్యాలి.
(బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి ప్రవచనములు మరియు శ్రీమతి శ్రీ విద్య గారు రచించిన వ్యాసవిద్య అనే పుస్తకం నుంచి సేకరించిన సమాచారం)
కాలభైరవాష్టకం
https://youtu.be/nCOJ1NFWpQQ?si=EyBOvT4OmZrL6hhM
PDF
https://srivaddipartipadmakar.org/stotram/kalabhairava-astakam-jagadguru-sankaracharya-swami/pcatid/108/