కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జూన్ 12 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసము శుక్లపక్షం
తిథి: షష్ఠి రా. 7.12 కు తదుపరి సప్తమి
వారం: సౌమ్యవారము (బుధవారం)
నక్షత్రం: మఘ రా. 2.32 కు తదుపరి పుబ్బ
యోగం: హర్షణ సా. 05.16 కు తదుపరి వజ్ర
కరణం: కౌలవ తె. 06.17 కు తదుపరి తైతుల
రాహుకాలం: మ. 12.00 - 01.30 కు
దుర్ముహూర్తం: ఉ. 11.50 - 12.43 కు
వర్జ్యం: మ. 1.28 - 3.12 కు
అమృతకాలం: రా. 11.46 - 1.30 కు
సూర్యోదయం: ఉ. 5.41 కు
సూర్యాస్తమయం: సా. 6.51 కు
గురుబోధ:
పరమాత్ముని యొక్క అవ్యాజకరుణ ఎంతో ఆశ్చర్యపరుస్తుంది. బలి ఎంతటి దానశీలి అయినా భగవంతుడే ద్వారపాలకుడిలా ఉంటాను అన్నాడంటే, ఆది భక్తుని అదృష్టం. సాధారణంగా భక్తులు, ఆలయాన్ని శుభ్రపరచడం కానీ, ఆలయానికి సంబంధించిన వేరే ఎటువంటి కార్యక్రమాలను అయినా కానీ, ఇటువంటి సేవల వల్ల వారికి రాజవైభవాలు కలుగుతాయి. ఎన్నో జన్మల పుణ్యం ఉంటే కానీ భక్తులు ఆలయానికి ద్వారపాలకులుగా ఉండలేరు. అటువంటిది తాను సృష్టించిన సృష్టిలో ఉన్న మూడు అడుగులు తీసుకున్నందుకుగాను, భగవంతుడు బలిచక్రవర్తికి యుగాంతం వరకు ద్వారపాలకుడిగా ఉంటానన్నాడు. ఇది కేవలం ఆ భక్తుని పట్ల భగవంతుడికి ఉన్న అపారకరుణ.