కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 మే 31 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసము కృష్ణ పక్షం
తిథి: అష్టమి ఉ. 8.46 కు తదుపరి నవమి
వారం: భృగువారము (శుక్రవారం)
నక్షత్రం: శతభిషం తె. 4.10 కు తదుపరి ఉత్తరాభాద్ర
యోగం: విష్కంభ సా. 06.05 కు తదుపరి ప్రీతి
కరణం: కౌలవ ఉ. 08.38 కు తదుపరి తైతుల
రాహుకాలం: ఉ. 10.30 - 12.00 కు
దుర్ముహూర్తం: ఉ. 08.18 - 09.11 & మ. 12.40 - 01.33 కు
వర్జ్యం: మ. 11.46 - 1.15 కు
అమృతకాలం: రా. 8.42 - 10.11 కు
సూర్యోదయం: ఉ. 5.41 కు
సూర్యాస్తమయం: సా. 6.47 కు
గురుబోధ:
భక్తులంతా ఈ క్రిందిశ్లోకాన్ని నిరంతరం తలుచుకోండి, వీలున్నప్పుడల్లా జపం చేయండి.
శ్లో|| బుద్ధిః బలం యశో ధైర్యం నిర్భయత్వం, అరోగతా |
అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాత్ భవేత్||
ఇది ఒక అద్భుతమైన శ్లోకం. బుద్ధి, బలం, కీర్తి, మనస్సులో కలతలేకుండుట, భయం లేకుండుట, రోగం లేకుండుట, చురుకుదనం, ఉపన్యాస పటుత్వం, ఇవన్నీ హనుమస్మరణ వల్ల జీవులకు కలుగుతాయి.
ఇది వాల్మీకి మహర్షి రచించిన శ్లోకం కాదు. పరాశరుడు ఆంజనేయుని భక్తుడు, హనుమంతుని చరిత్రను పరాశరసంహిత అనే పేరుతో గ్రంథంగా రాసిన మహానుభావుడు. ఆయన అందించిన గొప్ప శ్లోకము ఇది. హనుమంతుడు భారతీయ కాలమానం ప్రకారము వైశాఖ మాసం, కృష్ణ పక్షం, దశమీ తిథి నాడు జన్మించాడు. ఆనాడు శనివారం కూడా కలసి వచ్చింది. వైశాఖే మాసే కృష్ణాయాం దశమ్యాం మందవాసరే అని పరాశరసంహిత వంటి గ్రంథాలు, మంత్ర శాస్త్రాలు కూడా చెపుతున్నాయి.