కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 మే 29 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసము కృష్ణ పక్షం
తిథి: షష్ఠి మ. 1.16 కు తదుపరి సప్తమి
వారం: సౌమ్యవారము (బుధవారం)
నక్షత్రం: శ్రవణం ఉ. 8.40 కు తదుపరి ధనిష్ఠ
యోగం: ఐంద్ర రా. 11.34 కు తదుపరి వైధృతి
కరణం: వణిజ మ. 01.39 కు తదుపరి విష్టి
రాహుకాలం: మ. 12.00 - 01.30 కు
దుర్ముహూర్తం: ఉ. 11.48 - 12.40 కు
వర్జ్యం: మ. 12.26 -1.57 కు
అమృతకాలం: రా. 9.31 - 11.01 కు
సూర్యోదయం: ఉ. 5.41 కు
సూర్యాస్తమయం: సా. 6.46 కు
గురుబోధ:
ఏ దేవతా పూజ, జపము లేదా స్తోత్ర పారాయణము చేస్తున్నా గణపతికి ముందు నమస్కరిస్తాము. దేవతలందరికి గణపతి అంటే అంత ప్రీతి, భక్తి. గణపతి కి అంతటి ప్రాముఖ్యం, మాహాత్మ్యం కేవలం తల్లితండ్రులని గౌరవించడం, పూజించడం వల్ల వచ్చిందని శివపురాణం చెపుతోంది. అందుకే మనం కూడా తల్లిదండ్రులను, పెద్దలను, గురువులను గౌరవిస్తే దేవతలు ప్రీతిచెందుతారు.