May 21 2024మే 21 2024favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 మే 21 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసము శుక్ల పక్షం

తిథి: త్రయోదశి సా. 4.38 కు తదుపరి చతుర్దశి
వారం: భౌమవారము (మంగళవారం)
నక్షత్రం: స్వాతి పూర్తి
యోగం: వ్యతీపాత మ. 12.36 కు తదుపరి వరీయాన్
కరణం: తైతుల సా. 05.39 కు తదుపరి గరజి
రాహుకాలం: మ. 03.00 - 04.30 కు
దుర్ముహూర్తం: ఉ. 08.19 - 09.11 కు & రా. 11.07 - 11.51 కు
వర్జ్యం: ఉ. 11.13 - 12.58 కు
అమృతకాలం: రా. 9.34 - 11.17 కు
సూర్యోదయం: ఉ. 5.43 కు
సూర్యాస్తమయం: సా. 6.43 కు

🕉️ భౌమచతుర్దశి 🕉️


ఋణవిమోచన అంగారక(కుజ) స్తోత్రము👇
https://youtu.be/Ij6aTtQF42Y?si=TmOsGcnDLMFOEnRo

గురుబోధ
చతుర్దశీ తిథి మంగళవారం వస్తే ఆ పర్వదినమును అంగారకచతుర్దశి లేదా భౌమచతుర్దశి అంటారు. మానవులై పుట్టాక ఏదో ఒక ఋణం మనలను పట్టి పీడిస్తూ ఉంటుంది. ఋణ సంబంధమైన విముక్తి అంత తేలిక కాదు. అందునా ధనసంబంధమైన ఋణాలు మానవులని బాగా పట్టి పీడిస్తుంటాయి. ఇతరులు మనకు అప్పు ఉండి ఆ అప్పు తీర్చకపోయినా, మనం ఇతరులకు ఇవ్వవలసిన సొమ్ము ఇవ్వలేకపోయినా ఈ రెండు రకాల ఋణాల నుండి విముక్తి పొందడానికి భక్తి శ్రద్ధలతో ఈ కుజస్తోత్రమును పారాయణం చేయమని సాక్షాత్తూ బ్రహ్మదేవుడు కుమారస్వామికి చెప్పాడు. అందువలన ఈ స్తోత్రాన్ని తప్పక భక్తి శ్రద్ధలతో పారాయణ చేసుకున్నా, విన్నా సకల ఋణాలూ తొలగిపోతాయి. అందునా మంగళవారమునాడు ఈ దివ్య స్తోత్రాన్ని పారాయణ చేసుకున్నా లేక విన్నా, తక్షణం ఋణవిముక్తి అవుతుంది.

expand_less