April 30 2024ఏప్రిల్ 30 2024favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఏప్రిల్ 30 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు చైత్ర మాసము కృష్ణ పక్షం

తిథి: సప్తమి రా. 2.49 కు తదుపరి అష్టమి
వారం: భౌమవారము (మంగళవారం)
నక్షత్రం: ఉత్తరాషాఢ రా 1.36 కు తదుపరి శ్రవణం
యోగం: సాధ్య రా. 10.24 కు తదుపరి శుభ
కరణం: వణిజ ఉ. 07.05 కు తదుపరి విష్టి
రాహుకాలం: మ. 03.00 - 04.30 కు
దుర్ముహూర్తం: ఉ. 08.24 - 09.15 కు & రా. 11.06 - 11.51 కు
వర్జ్యం: తె. 5.24 - 6.54 కు & ఉ. 10.13-11.45 కు
అమృతకాలం: రా. 7.27 - 9.00 కు
సూర్యోదయం: ఉ. 5.51 కు
సూర్యాస్తమయం: సా. 6.36 కు

గురుబోధ:
గురు గ్రహం సంవత్సరమునకు ఒక సారి 12 రాశులలోకి, ఒక రాశి, నుండి మరియొక రాశిలోనికి మారినప్పుడల్లా, భారత దేశంలోని నదీనదములకు పుష్కరములు ఏర్పడతాయి. గురుడు వృషభరాశి లో ప్రవేశించినప్పుడు నర్మదానదమునకు పుష్కరాలు వస్తాయి. ఆ సమయంలో, ఆ నది సకల తీర్థాలను తనలో నింపుకొంటుంది. అందువల్లే పుష్కర కాలంలో నదీనదములకు మహామహిమలు కలుగుతాయి.

expand_less