కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఏప్రిల్ 24 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు చైత్ర మాసము కృష్ణ పక్షం
తిథి: పాడ్యమి 25 తె 5.33 కు తదుపరి విదియ
వారం: సౌమ్యవారము (బుధవారం)
నక్షత్రం: స్వాతి రా 11.47 కు తదుపరి విశాఖ
యోగం: సిద్ధి 25 తె. 05.06 కు తదుపరి వ్యతీపాత
కరణం: బాలవ సా. 06.05 కు తదుపరి కౌలవ
రాహుకాలం: మ. 12.00 - 01.30 కు
దుర్ముహూర్తం: ఉ. 11.49 - 12.40 కు
వర్జ్యం: తె. 5.44 - 7.14 కు
అమృతకాలం: మ. 2.21 - 4.05 కు
సూర్యోదయం: ఉ. 5.54 కు
సూర్యాస్తమయం: సా. 6.35 కు
గురుబోధ:
జలదానం అత్యంత పవిత్రమైన, ఉత్కృష్టమైన దానం. జలదానం చేయనివారు మరుజన్మలో బల్లిగా పుడతారు. చలివేంద్రాలు ఏర్పాటు చేసి సేవచేసినవారు సర్వశుభాలను పొందుతారు. పూర్వజన్మలో జలదానం చేయని పాపం వేంకటాద్రిపై చేసే జలదానం వలన తొలగుతుంది. - శ్రీ స్కాందపురాణం.