కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఏప్రిల్ 17 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు చైత్ర మాసము శుక్ల పక్షం
తిథి: నవమి సా 5.26 కు తదుపరి దశమి
వారం: సౌమ్యవారము (బుధవారం)
నక్షత్రం: పుష్యమి ఉ 7.40 కు తదుపరి ఆశ్లేష
యోగం: శూల రా. 11.51 కు తదుపరి గండ
కరణం: కౌలవ మ. 03.14 కు తదుపరి తైతుల
రాహుకాలం: మ. 12.00 - 01.30 కు
దుర్ముహూర్తం: ఉ. 11.51 - 12.41 కు
వర్జ్యం: రా. 9.31 - 11.15 కు
అమృతకాలం: లేదు
సూర్యోదయం: ఉ. 5.59 కు
సూర్యాస్తమయం: సా. 6.33 కు
🕉️👉శ్రీ రామనవమి👈🕉️
గురుబోధ
◆ చైత్ర శుక్ల పక్ష నవమి శ్రీరామనవమి - శ్రీరాముడు కౌసల్యా దశరథులకు మరియు జగన్మాత పార్వతీదేవి మేనా హిమవంతులకు జన్మించిన పవిత్ర తిథి. - శ్రీ శివ మహాపురాణం
◆ ఇదే రోజు1608 వ సం౹౹ రాణుబాయికి, సూర్యాజీపంతునకు శ్రీ సమర్థ రామదాస స్వామి జన్మించారు. వీరే ఛత్రపతి శివాజీ మహరాజ్ కి గురువులు. వీరు రచించిన "దాసబోధ" శివాజీ మహరాజ్ గారికి నిత్యపారాయణ గ్రంథం. సమర్థ రామదాస స్వామి వారిని హనుమద్ అవతారం గా కీర్తిస్తారు.
◆శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాలలో శ్రీ రామవతారం 7వది. ఈ రోజు చేయవలసిన కొన్ని ముఖ్యమైనవి:
1) శ్రీ రామచంద్రప్రభువుని యథాశక్తి శ్రీసూక్తం, పురుషసూక్తంతో అర్చించడం ; 2) శ్రీ రామునికి అష్టోత్తరశతనామావళితో పూజ ; 3) శ్రీ రాముని తులసీదళాలతో అర్చించడం, రామనామజపం ; 4) శ్రీ రామరక్షాస్తోత్రం లేదా సంక్షిప్త రామాయణం పారాయణం ; 5) ఆలయదర్శనం, గురువులకి నమస్కారములు, గుడిలో ప్రదక్షిణలు; 6) హనుమాన్ చాలీసా పారాయణం; 7) భక్తిశ్రద్ధలతో యథాశక్తి దానం
https://youtu.be/9MvrbV8bMPY?si=JS49J3h-Rk_3TiZG