కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఏప్రిల్ 16 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు చైత్ర మాసము శుక్ల పక్షం
తిథి: అష్టమి సా 4.24 కు తదుపరి నవమి
వారం: భౌమవారము (మంగళవారం)
నక్షత్రం: పునర్వసు ఉ 6.10 కు తదుపరి పుష్యమి
యోగం: ధృతి రా. 11.17 కు తదుపరి శూల
కరణం: బవ మ. 01.23 కు తదుపరి బాలవ
రాహుకాలం: మ. 03.00 - 04.30 కు
దుర్ముహూర్తం: ఉ. 08.30 - 09.20 కు & రా. 11.07 - 11.53 కు
వర్జ్యం: మ. 2.40 - 4.22 కు
అమృతకాలం: రా. 12.42 - 2.22 కు
సూర్యోదయం: ఉ. 5.59 కు
సూర్యాస్తమయం: సా. 6.33 కు
గురుబోధ:
శ్రీరామనవమి పర్వతిథి నాడు చేసే దానం, చేసే పూజ, ప్రదక్షిణలు, ఏ పుణ్యమైనా కొండంత ఫలితం ఇస్తుంది.
అష్టమీ తిథి అమ్మవారికి, శివుని అత్యంత ప్రీతికరం. మంగళవారం వసంతనవరాత్రులలో చేసే అమ్మవారి పూజ, జపం, స్తోత్ర పారాయణలు విశేషఫలితాలనిస్తాయి.