కాలం - అనుకూలం ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 ఏప్రిల్ 03 2024 🌟 శ్రీ శోభకృతు నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిరఋతువు ఫాల్గుణమాసము కృష్ణపక్షం తిథి: నవమి మ. 1.54 కు తదుపరి దశమి వారం: సౌమ్యవారము (బుధవారం) నక్షత్రం: ఉత్తరాషాఢ సా 5.41 కు తదుపరి శ్రవణం యోగం: శివ సా. 04.10 కు తదుపరి సిద్ధ కరణం: తైతుల ఉ. 07.23 కు తదుపరి గరజి రాహుకాలం: మ. 12.00 - 01.30 కు దుర్ముహూర్తం: ఉ. 11.55 - 12.44 కు వర్జ్యం: రా. 9.29 - 11.00 కు అమృతకాలం: ఉ. 11.33 - 1.05 కు సూర్యోదయం: ఉ. 6.09 కు సూర్యాస్తమయం: సా. 6.30 కు గురుబోధ: సదాచారాలు పాటించేవారికి సకలశుభాలు దేవతలు ప్రసాదిస్తారు. వారు ప్రత్యేక పూజలు, జపములు అవకాశం లేక చేయకపోవడం దోషమేమీకాదు. ఆచారాలు పాటించకుండా ఎన్ని పూజలు, జపములు చేసినా దేవతలు అనుగ్రహించరు.