కాలం - అనుకూలం ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 ఏప్రిల్ 02 2024 🌟 శ్రీ శోభకృతు నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిరఋతువు ఫాల్గుణ మాసము కృష్ణపక్షం తిథి: అష్టమి మ. 3.26 కు తదుపరి నవమి వారం: భౌమవారము (మంగళవారం) నక్షత్రం: పూర్వాషాఢ సా. 6.33 కు తదుపరి ఉత్తరాషాఢ యోగం: పరిఘ సా. 06.36 కు తదుపరి శివ కరణం: బాలవ ఉ. 08.44 కు తదుపరి కౌలవ రాహుకాలం: మ. 03.00 - 04.30 కు దుర్ముహూర్తం: ఉ. 08.38 - 09.27 కు & రా. 11.09 - 11.56 కు వర్జ్యం: రా. 2.16 - 3.48 కు అమృతకాలం: మ. 1.55 - 3.29 కు సూర్యోదయం: ఉ. 6.10 కు సూర్యాస్తమయం: సా. 6.30 కు 👉🕉️ శీతలాష్టమి 🕉️👈 గురుబోధ: ఫాల్గుణశుక్లాష్టమినాడు అమ్మవారు పార్వతీ రూపంలో, ఫాల్గుణ కృష్ణాష్టమి నాడు శీతలాదేవి గా సంచరిస్తుంది. ఈ రెండు అష్టములలోనూ అమ్మవారిని భక్తితో పుష్పాలతో, కుంకుమతో పూజించి అన్న నైవేద్యం తో సంతృప్తిపరచాలి. బహుళాష్టమినాడు ఈ క్రింది శ్లోకాలు పఠించాలి. అలా చేసిన వారికి ఎంత కష్టమైన పని అయినా ఆరునెలలులోగా పూర్తి అవుతుంది. క్లిష్టకార్యాలు పూర్తి చేసుకోవడానికి ఇంతకు మించిన సులభోపాయం మరొకటి లేదు. ఆ శ్లోకాలు ఇవి శ్లో || శీతలే! త్వం జగన్మాతా, శీతలే! త్వం జగత్పితా శీతలేత్వం జగద్ధాత్రీ, శీతలాయై నమోనమః శ్లో || వందేహం శీతలాదేవీం, రాసభస్థాం దిగంబరామ్ మార్జనీ కలశోపేతాం విస్ఫోటక వినాశనీమ్