కాలం - అనుకూలం ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 మార్చి 26 2024 🌟 శ్రీ శోభకృతు నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాసము కృష్ణ పక్షం తిథి: పాడ్యమి మ. 1.31 కు తదుపరి విదియ వారం: భౌమవారము (మంగళవారం) నక్షత్రం: హస్త మ. 12.27 కు తదుపరి చిత్త యోగం: ధ్రువ రా. 10.18 కు తదుపరి వ్యాఘాత కరణం: కౌలవ మ. 02.55 కు తదుపరి తైతుల రాహుకాలం: మ. 03.00 - 04.30 కు దుర్ముహూర్తం: ఉ. 08.42 - 09.31 కు & రా. 11.11 - 11.58 కు వర్జ్యం: రా. 9.10 - 10.55 కు అమృతకాలం: ఉ. 7.30 కు సూర్యోదయం: ఉ. 6.15 కు సూర్యాస్తమయం: సా. 6.28 కు గురుబోధ: పురాణ శ్రవణము, యాత్రా ఫలితం, మనం చేసే దాన ధర్మములు మనలని, మన పిల్లలని, మన వంశాన్ని కూడా తరింపచేస్తాయి. పురాణములు వినడానికి ఎటువంటి నియమం లేదు. శ్రద్ధ, భక్తి ఉంటే చాలు. తింటూ, పనిచేస్తూ, భోజనం చేస్తూ, ప్రయాణం చేస్తూ కూడా వినవచ్చు. ఇంతకంటే తరించే సులభోపాయం మరొకటి లేదు.