కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 మార్చి 20 2024 🌟
శ్రీ శోభకృతు నామ సంవత్సరం
ఉత్తరాయణం శిశిరఋతువు ఫాల్గుణమాసము శుక్లపక్షం
తిథి: ఏకాదశి 21వ తేదీ తె. 4.07 కు తదుపరి ద్వాదశి
వారం: సౌమ్యవారము (బుధవారం)
నక్షత్రం: పుష్యమి రా. 12.31 కు తదుపరి ఆశ్లేష
యోగం: అతిగండ సా. 05.01 కు తదుపరి సుకర్మ
కరణం: వణిజ మ. 01.19 కు తదుపరి విష్టి
రాహుకాలం: మ. 12.00 - 01.30 కు
దుర్ముహూర్తం: ఉ. 11.59 - 12.48 కు
వర్జ్యం: ఉ. 7.27 - 9.09 కు
అమృతకాలం: మ. 3.35 - 5.17 కు
సూర్యోదయం: ఉ. 6.20 కు
సూర్యాస్తమయం: సా. 6.27 కు
👉🕉️ ఫాల్గుణశుద్ధ ఏకాదశి 🕉️👈
ఏకాదశీ ఉపవాసం ఈ రోజు ఉండాలి. ఏకాదశీ ఉపవాసం ఉన్నవారు ద్వాదశీ పారణ రేపు చేయాలి.
గురుబోధ
ఏకాదశి అంటే హరిహరులకు ప్రీతి. ఏకాదశి అనే మాట వింటేనే యమకింకరులు వణికిపోతారు. తులసీదళాలతో హరిని, బిల్వదళాలతో హరుడిని అర్చన చేసి, ఉపవాసం ఉండి రాత్రికి నక్త భోజనం కానీ లేదా సంపూర్ణ ఉపవాసం కానీ ఉండి భగవంతుని కథలు వింటూ భగవత్ ధ్యానం చేసినవాడు జీవితంలో యమకింకరుల దర్శనము చేయడు. నరకానికి వెళ్ళడు. సకల శుభాలు పొందుతాడు. ఏకాదశి నాడు ఒక వెయ్యీ ఎనిమిది తులసీదళాలు, బిల్వపత్రాలతో శివుణ్ణి పూజించిన వాడు ఐశ్వర్యము పొందుతాడు. చామంతి పువ్వులు, తులసీదళాలతో విష్ణువును పూజించిన వాడు మంచి పదవిని పొందుతాడు. ఏకాదశి రోజు జాగరణ చేసి మరుసటి రోజు హరి దర్శనము చేసుకున్నవాడు జీవితంలో సుఖం, శాంతి, ఆనందం తప్ప మాటవరుసకి కూడా దౌర్భాగ్యం పొందడు.
శ్రీ వాసుదేవ శత నామాలు👇