కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 మార్చి 11 2024 🌟
శ్రీ శోభకృతు నామ సంవత్సరం
ఉత్తరాయణం శిశిరఋతువు ఫాల్గుణ మాసము శుక్ల పక్షం
తిథి: పాడ్యమి మ. 1.06 కు తదుపరి విదియ
వారం: ఇందువారము (సోమవారం)
నక్షత్రం: ఉత్తరాభాద్ర రా. 2.08 కు తదుపరి రేవతి
యోగం: శుభ ఉ. 11.58 కు తదుపరి శుక్ల
కరణం: బవ ఉ. 10.44 కు తదుపరి బాలవ
రాహుకాలం: ఉ. 07.30 - 09.00 కు
దుర్ముహూర్తం: మ. 12.50 - 01.38 కు & మ. 03.14 - 04.02 కు
వర్జ్యం: మ. 12.41 - 2.11 కు
అమృతకాలం: రా. 9.34 - 10.03 కు
సూర్యోదయం: ఉ. 6.27 కు
సూర్యాస్తమయం: సా. 6.25 కు
🕉️ సకల దుఃఖ వినాశం - ఫాల్గుణ మాసం ప్రారంభం 🕉️
గురుబోధ:
దుఃఖానికి మూలం జీవులు చేసే పాపాలు. పాపాలు కర్మను అనుసరిస్తాయి. మరలా మరలా కర్మలు చేసేలా జీవుడ్ని ప్రేరేపిస్తాయి. ఈ కర్మల నుండి బయటపడడం అంత తేలికకాదు. ఎన్ని జన్మలు ఎత్తినా కర్మబంధాల నుండి మాత్రం బయటపడలేక జీవులు నానాయాతనలు పడుతుంటారు. ఈ కర్మఫలాలు తొలగించి సకలదుఃఖవినాశనం చేసే దివ్య మాసం ఫాల్గుణ మాసం.
ఫాల్గుణ మాసంలో ఆవు నెయ్యి, ఆవు పెరుగు, తేనె - ఈ మూడింటితో శివలింగాన్ని అభిషేకించిన వారికి 90 రోజుల్లో సంపదలు లభిస్తాయి. ఫాల్గుణ మాసాన్ని సద్వినియోగం చేసుకొని దుఃఖవిముక్తిని పొందుదాము.
శ్రీ శివ సహస్రనామ స్తోత్రం👇