March 05 2024మార్చి 05 2024favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 మార్చి 05 2024 🌟
శ్రీ శోభకృతు నామ సంవత్సరం
ఉత్తరాయణం శిశిరఋతువు మాఘమాసము కృష్ణపక్షం

తిథి: దశమి రా.  1.41 కు తదుపరి ఏకాదశి
వారం: భౌమవారము (మంగళవారం)
నక్షత్రం: మూల ఉ.  11.24 కు తదుపరి పూర్వాషాఢ
యోగం: సిద్ధి మ.  02.09 కు తదుపరి వ్యతీపాత
కరణం: గరజి ఉ.  08.04 కు తదుపరి వణిజ
రాహుకాలం: మ. 03.00 - 04.30 కు
దుర్ముహూర్తం: ఉ.  08.54 - 09.41 కు & రా.  11.15 - 00.03 కు
వర్జ్యం: ఉ.  9.48 - 11.24 కు & రా.  8.46 - 10.19 కు
అమృతకాలం: ఉ. 6.10 - 6.39 కు
సూర్యోదయం: ఉ.  6.32 కు
సూర్యాస్తమయం: సా.  6.24 కు

గురుబోధ:
బ్రహ్మ, విష్ణువుల ఇద్దరి మధ్య యుద్ధం ఆపడం కోసం మాఘమాసంలో లోకశ్రేయస్సు కోసం ఈశ్వరుడు ఒక అగ్నిస్తంభరూపం ధరించాడు. ఇది శివలింగం అని పిలువబడుతుంది. ఈ లింగమునకు రూపమూ ఉంది. రూపమూ లేదు. ఆకారము ఉంటుంది కాబట్టి  లింగం ఇటు సగుణము, నిర్గుణము కూడా.  శివరాత్రి నాడు రాత్రి 12 గంటలకు మీ యుద్ధం ఆపడానికి లింగం రూపం ధరించాను, కనుక ఈ కాలమును లింగోద్భవకాలము అని అంటారు. ఈ లింగోద్భవకాలములో తనను అర్చించిన వాళ్ళు శాశ్వతంగా కైలాసములో నివసిస్తారు. వారికున్న ఈతి భాధలు తొలగిపోతాయి అని పరమశివుడు వరమిచ్చాడు.

శివరాత్రి మాహాత్మ్యం👇


expand_less