కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఫిబ్రవరి 24 2024 🌟
శ్రీ శోభకృతు నామ సంవత్సరం
ఉత్తరాయణం శిశిరఋతువు మాఘమాసము శుక్లపక్షం
తిథి: పూర్ణిమ సా. 5.10 కు తదుపరి పాడ్యమి
వారం: స్థిరవారము (శనివారం)
నక్షత్రం: మఘ రా. 9.45 కు తదుపరి పుబ్బ
యోగం: అతిగండ మ. 01.35 కు తదుపరి సుకర్మ
కరణం: బవ సా. 05.59 కు తదుపరి బాలవ
రాహుకాలం: ఉ. 09.00 - 10.30 కు
దుర్ముహూర్తం: ఉ. 06.38 - 08.12 కు
వర్జ్యం: ఉ. 8.33-10.18 కు
అమృతకాలం: రా. 7.04 - 8.49 కు
సూర్యోదయం: ఉ. 6.38 కు
సూర్యాస్తమయం: సా. 6.21 కు
🕉️👉మాఘపూర్ణిమ, శ్రీప్రణవపీఠ ఏకాదశ వార్షికోత్సవములు👈🕉️
గురుబోధ:
శ్రీ లలితాదేవి ఒక కల్పంలో అవతరించిన రోజుగా మాఘ పూర్ణిమను భావిస్తారు. మాఘపూర్ణిమ రోజు లలితాదేవి ఆరాధన విశేష శుభఫలితాలను ప్రసాదిస్తుంది. పూర్ణిమ, అమావాస్య మొ౹౹ పర్వదినములలో చేసే అర్చన, పూజ, జపం రెట్టింపు ఫలితాలను ఇస్తుంది.
మాఘపూర్ణిమ --> ద్వాపరయుగం ఆరంభమైన పుణ్యతిథి. ఈ తిథినాడు ఏదైనా ఆలయాన్ని ప్రతిష్ఠిస్తే, ప్రతిష్ఠ చేసినవారు, వారి వారసులు, ఆ కార్యక్రమానికి వెళ్ళినవారు ఈ జన్మలోనే ముక్తి పొందుతారు.- శ్రీ స్కాందపురాణం - కౌమారికా ఖండము
శ్రీప్రణవపీఠంలో త్రిమాతల ప్రతిష్ఠ , అలాగే అనేక దేవతా మూర్తుల ప్రతిష్ఠ జరిగినది కూడా ఈరోజే. ఇదే రోజున 2023 ఫిబ్రవరి 4,5 తేదీలలో ధ్వజ స్తంభం, సింహ వాహనం, బలి పీఠం ప్రతిష్ఠ జరిగాయి. ఈ సంవత్సరం ఫిబ్రవరి 24వ తేదీన శ్రీ రమాసమేత శ్రీ సత్యనారాయణ స్వామి, శ్రీ ఆంజనేయస్వామి వారల ప్రతిష్ఠ జరుగబోతోంది.
ఈ తిథులలో చేసే అల్పదానమైనా అనల్పమవుతుంది, అక్షయమవుతుంది, అత్యంత పుణ్యప్రదం. ఎంతోకొంత తమ శక్తిని బట్టి దానం చేస్తే జీవితంలో ఏ లోటూ రాదు.
శ్రీ లలితా త్రిశతి👇శ్రీ లలితా సహస్రనామం👇