Feb 23 2024ఫిబ్రవరి 23 2024favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఫిబ్రవరి 23 2024 🌟
శ్రీ శోభకృతు నామ సంవత్సరం
ఉత్తరాయణం శిశిరఋతువు మాఘమాసము శుక్లపక్షం

తిథి: చతుర్దశి మ.  3.18 కు తదుపరి పౌర్ణమి
వారం: భృగువారము (శుక్రవారం)
నక్షత్రం: ఆశ్లేష రా.  7.21 కు తదుపరి మఘ
యోగం: శోభన మ.  12.48 కు తదుపరి అతిగండ
కరణం: వణిజ మ.  03.33 కు తదుపరి విష్టి
రాహుకాలం: ఉ. 10.30 - 12.00 కు
దుర్ముహూర్తం: ఉ.  08.59 - 09.46 కు & మ.  12.53 - 01.40 కు
వర్జ్యం: ఉ.  7.10 - 8.54 కు
అమృతకాలం: సా.  5.33 - 7.17 కు
సూర్యోదయం: ఉ.  6.39 కు
సూర్యాస్తమయం: సా.  6.21 కు

🕉️👉శ్రీప్రణవపీఠ ఏకాదశ వార్షికోత్సవములు, ఏలూరు👈🕉️

గురుబోధ:
మాఘపూర్ణిమ‌ --> ద్వాపరయుగం ఆరంభమైన పుణ్యతిథి. ఈ తిథినాడు ఏదైనా ఆలయాన్ని ప్రతిష్ఠిస్తే, ప్రతిష్ఠ చేసినవారు, వారి వారసులు, ఆ కార్యక్రమానికి వెళ్ళినవారు ఈ జన్మలోనే ముక్తి పొందుతారు.- శ్రీ స్కాందపురాణం - కౌమారికా ఖండము

శ్రీప్రణవపీఠంలో త్రిమాతల ప్రతిష్ఠ , అలాగే అనేక దేవతా మూర్తుల ప్రతిష్ఠ జరిగినది కూడా ఈరోజే. ఇదే రోజున 2023 ఫిబ్రవరి 4,5 తేదీలలో ధ్వజ స్తంభం, సింహ వాహనం, బలి పీఠం ప్రతిష్ఠ జరిగాయి. ఈ సంవత్సరం ఫిబ్రవరి 24వ తేదీన శ్రీ రమాసమేత శ్రీ సత్యనారాయణ స్వామి, శ్రీ ఆంజనేయస్వామి వారల ప్రతిష్ఠ జరుగబోతోంది.

ఈ తిథులలో చేసే అల్పదానమైనా అనల్పమవుతుంది, అక్షయమవుతుంది, అత్యంత పుణ్యప్రదం. ఎంతోకొంత తమ శక్తిని బట్టి దానం చేస్తే జీవితంలో ఏ లోటూ రాదు. 

expand_less