Feb 21 2024ఫిబ్రవరి 21 2024favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఫిబ్రవరి 21 2024 🌟
శ్రీ శోభకృతు నామ సంవత్సరం
ఉత్తరాయణం శిశిరఋతువు మాఘమాసము శుక్లపక్షం

తిథి: ద్వాదశి మ.  12.39 కు తదుపరి త్రయోదశి
వారం: సౌమ్యవారము (బుధవారం)
నక్షత్రం: పునర్వసు మ.  3.34 కు తదుపరి పుష్యమి
యోగం: ఆయుష్మాన్ ఉ.  11.51 కు తదుపరి సౌభాగ్య
కరణం: బాలవ ఉ.  11.27 కు తదుపరి కౌలవ
రాహుకాలం: మ. 12.00 - 01.30 కు
దుర్ముహూర్తం: మ.  12.07 - 12.53 కు
వర్జ్యం: రా.  12.08 - 1.51 కు
అమృతకాలం: మ.  1.04 - 2.45 కు
సూర్యోదయం: ఉ.  6.40 కు
సూర్యాస్తమయం: సా.  6.20 కు

ఏకాదశీ ఉపవాసం ఉన్నవారు ద్వాదశీ పారణ (బుధవారం) ఉదయం చేయచ్చు.

🕉️ ప్రదోషం, భీమసేన జయంతి 🕉️

గురుబోధ
ప్రదోషసమయం (సాయం సంధ్య) లో శివారాధన, శివ పూజ, శివాభిషేకము, జపము చాలా విశేషమైనది. మహాభారతం ఆనుశాసనిక పర్వంలో ఉండే వేదాలు, ఉపనిషత్ సారమైన అత్యద్భుత స్తోత్రం శివసహస్రనామ స్తోత్రం. ఇది మానసిక, శారీరిక ఆరోగ్యాన్ని ప్రసాదించడమే కాక స్వర్గాన్ని సైతం ప్రసాదిస్తుంది. ఒక సంవత్సరం పాటు విడిచిపెట్టకుండా చదివినా, శ్రవణం చేసినా, వాళ్ళు అశ్వమేథయాగం చేసిన ఫలితాన్ని పొందుతారు.

శ్రీ శివసహస్రనామ స్తోత్రం👇


expand_less