Feb 17 2024ఫిబ్రవరి 17 2024favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఫిబ్రవరి 17 2024 🌟
శ్రీ శోభకృతు నామ సంవత్సరం
ఉత్తరాయణం శిశిరఋతువు మాఘమాసము శుక్లపక్షం

తిథి: అష్టమి మ.  1.18 కు తదుపరి నవమి
వారం: స్థిరవారము (శనివారం)
నక్షత్రం: కృత్తిక మ.  1.39 కు తదుపరి రోహిణి
యోగం: ఐంద్ర మ.  01.44 కు తదుపరి వైధృతి
కరణం: బవ ఉ.  08.15 కు తదుపరి బాలవ
రాహుకాలం: ఉ. 09.00 - 10.30 కు
దుర్ముహూర్తం: తె.  06.42 - 07.29 కు & ఉ.  07.29 - 08.15 కు
వర్జ్యం: తె.  4.00 - 5.29 కు
అమృతకాలం: ఉ.  11.21 - 12.54 కు
సూర్యోదయం: ఉ.  6.42 కు
సూర్యాస్తమయం: సా.  6.18 కు

🕉️ భీష్మాష్టమి 🕉️
🕉️ శ్యామలానవరాత్రులు 8వ రోజు 🕉️

గురుబోధ:

ఈరోజు సంతానార్థులైన వారు భీష్మోద్దేశ్యముగా శ్రాద్ధము ఆచరించవలెను. భీష్మ తర్పణం, అర్ఘ్యం మాత్రము(తల్లి తండ్రులు ఉన్నవారు కూడా) అందరూ చేయవలసినదే. 

వైయాఘ్ర పదగోత్రాయ ౹ సాంకృత్య ప్రవరాయచ ౹౹
గంగాపుత్రాయ భీష్మాయ ౹ ఆజన్మ బ్రహ్మచారిణే౹౹
అపుత్రాయ జలందద్యాం ౹ నమో భీష్మవర్మణే ౹౹
భీష్మశ్శాంతనవో వీరః ౹ సత్యవాదీ జితేంద్రియః ౹౹
అభిరద్భి రవాప్నోతు ౹ పుత్ర పౌత్రోచితాంక్రియామ్ ౹౹

తర్పణ క్రమః

1. వైయాఘ్రపద గోత్రం సాంకృత్య ప్రవరం గంగాపుత్రం భీష్మ వర్మాణం
   తర్పయామి -  3 సార్లు
2. ఆజన్మ బ్రహ్మచారిణం  అపుత్రాయ భీష్మవర్మాణం 
  తర్పయామి - 3సార్లు
3. శంతను తనూభావం వీరం సత్యవాదినం జితేంద్రియం
భీష్మవర్మాణం తర్పయామి - 3సార్లు

ఈ రీతిగా తర్పణమిచ్చి సవ్యంగా ఈ క్రింద శ్లోకంతో అర్ఘ్యం ఇవ్వవలెను.

 శ్లో.  వసూనామవతారాయ ౹ శంతనోరాత్మజాయచ ౹౹ 
అర్ఘ్యం దదామి భీష్మాయ  ౹ ఆబాల్య బ్రహ్మచారిణే ౹౹

ఇతిభీష్మ తర్పణ విధిః

1) భీష్ముడు యుద్ధరంగంలో పడిపోయి కూడా ఈ మాఘమాసం వచ్చేదాకా ప్రాణాన్ని శరీరంలో నిలబెట్టుకున్నాడు. మాఘమాసంలో శ్రీకృష్ణుడిని స్మరిస్తూ శరీరం విడిచిపెట్టాడు. 
2) భీష్ముడు మాఘమాసంలో అష్టమి నాడు హరిని అనేక నామాలతో స్తోత్రం చేసాడు. పుండరీకాక్ష, వాసుదేవ, వరద, అప్రమేయ అని స్తోత్రం చేశాడు. అందుకే ఈ అష్టమికి భీష్మాష్టమి అని పేరు వచ్చింది. ఈ అష్టమి నాడు భక్తి శ్రద్ధలతో హరి నామం చేసేవాడు. శరీరం విడిచిపెట్టాక నరకం ముక్తి పొందాడు.

శ్యామలా దండకం👇

Sri Syamala Dandakam
expand_less