Feb 13 2024ఫిబ్రవరి 13 2024favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఫిబ్రవరి 13 2024 🌟
శ్రీ శోభకృతు నామ సంవత్సరం
ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసము శుక్లపక్షం

తిథి: చతుర్థి రా.  8.27 కు తదుపరి పంచమి
వారం: భౌమవారము (మంగళవారం)
నక్షత్రం: ఉత్తరాభాద్ర సా.  6.07 కు తదుపరి రేవతి
యోగం: సాధ్య రా.  11.05 కు తదుపరి శుభ రా.  07.59 కు
కరణం: విష్టి మ.  02.41 కు తదుపరి బవ
రాహుకాలం: మ. 03.00 - 04.30 కు
దుర్ముహూర్తం: ఉ.  09.03 - 09.49 కు & రా.  11.16 - 12.05 కు
వర్జ్యం: తె.  3.53 - 5.23 కు
అమృతకాలం: మ.  1.35 - 3.04 కు
సూర్యోదయం: ఉ.  6.44 కు
సూర్యాస్తమయం: సా.  6.17 కు

🕉️ కుంభసంక్రమణం 🕉️
🕉️ శ్యామలానవరాత్రులు 4వ రోజు 🕉️

గురుబోధ:
పితృదేవతల ఆశీర్వాదం ఉంటే ఆ ఇంటిలో అందరూ ఆయురారోగ్యాలతో సుఖంగా ఉంటారు. పిల్లల భవిష్యత్ బాగుంటుంది. పితృదేవతల అనుగ్రహము కలగాలంటే తప్పక చనిపోయిన తిథినాడు ఆబ్దికము, ప్రతి అమావాస్య, సంక్రమణ మొ౹౹ రోజులలో తర్పణాలు, పితృపక్షం లో శ్రాద్ధం పెట్టడం చేయాలి.
పితృదేవతల ప్రీత్యర్థం పితృస్తవం, శివకేశవ అష్టోత్తరము పారాయణము చేయడం మంచిది. పితరుల ప్రీత్యర్థం స్వయంపాకం దానం ఇవ్వడం, అర్హత కలిగిన వారు తమ పితరులకు తర్పణము ఇవ్వడం చేయాలి. పితృదేవతల అనుగ్రహం ఉంటే ఎటువంటి కష్టాలు ఉండవు.

శ్రీ శివ కేశవ అష్టోత్తరం👇


సుఖంగా బ్రతకడానికి  క్రోధి నామ సంవత్సర మంత్రశ్లోకం👇 


శ్యామలా దండకం👇

Sri Syamala Dandakam
expand_less