"కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 జనవరి 27 2024 🌟 శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం హేమంతఋతువు పుష్యమాసం కృష్ణపక్షము తిథి : విదియ రా. 02గం౹౹01ని౹౹ వరకు తదుపరి తదియ వారం : స్థిరవారము (శనివారం) నక్షత్రం : ఆశ్లేష మ. 12గం౹౹08ని౹౹ వరకు తదుపరి మఘ యోగం : ఆయుష్మాన్ ఉ. 08గం౹౹09ని౹౹ వరకు తదుపరి సౌభాగ్య కరణం : తైతుల మ. 02గం౹౹25ని౹౹ వరకు తదుపరి గరజి రాహుకాలం : ఉ. 09గం౹౹00ని౹౹ నుండి 10గం౹౹30ని౹౹ వరకు దుర్ముహూర్తం : తె. 06గం౹౹49ని౹౹ నుండి 08గం౹౹20ని౹౹ వరకు వర్జ్యం : రా. 01గం౹౹22ని౹౹ నుండి 03గం౹౹07ని౹౹ వరకు అమృతకాలం : ఉ. 10గం౹౹23ని౹౹ నుండి 12గం౹౹07ని౹౹ వరకు సూర్యోదయం : ఉ. 06గం౹౹38ని౹౹కు సూర్యాస్తమయం : సా. 05గం౹౹49ని౹౹కు గురుబోధ పూజ, వ్రతం వంటివి చేస్తున్నప్పుడు మనం ఆచమనం చేసే పాత్ర లోని నీళ్ళని (పంచపాత్ర లేదా నీళ్ళచెంబు) దేవతలకు వినియోగించరాదు. విడిగా దేవతలకు ఇంకొక పాత్రను వినియోగించాలి. తెలియక ఆచమనం చేసిన పాత్రనే నైవేద్యంకు ఉపయోగిస్తుంటారు. అలా చేయరాదు.