Jan 26 2024జనవరి 26 2024favorite_border

"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
     🌟 జనవరి 26 2024 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం హేమంతఋతువు పుష్యమాసం కృష్ణపక్షము

తిథి : పాడ్యమి  రా. 12గం౹౹08ని౹౹ వరకు తదుపరి విదియ
వారం : భృగువారము (శుక్రవారం)
నక్షత్రం : పుష్యమి ఉ. 09గం౹౹56ని౹౹ వరకు తదుపరి ఆశ్లేష
యోగం : ప్రీతి ఉ. 07గం౹౹42ని౹౹ వరకు తదుపరి ఆయుష్మాన్
కరణం :  బాలవ మ. 12గం౹౹18ని౹౹ వరకు తదుపరి కౌలవ
రాహుకాలం : ఉ. 10గం౹౹30ని౹౹ నుండి 12గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉ. 09గం౹౹05ని౹౹ నుండి 09గం౹౹50ని౹౹ వరకు & మ. 12గం౹౹51ని౹౹ నుండి 01గం౹౹37ని౹౹ వరకు
వర్జ్యం : రా. 11గం౹౹54ని౹౹ నుండి 01గం౹౹39ని౹౹ వరకు
అమృతకాలం : లేదు
సూర్యోదయం : ఉ. 06గం౹౹38ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 05గం౹౹48ని౹౹కు

గురుబోధ
అగస్త్యుడు లోపాముద్రాసమేతంగా కరవీరపురం (కోలాపురం/కొల్హాపురం) చేరి మంగళదేవత, మంగళస్వరూపిణి, విష్ణువు యొక్క హృదయపద్మంలో ఉంటూ తెల్లని, బంగారురంగుతో ఉండే శ్రీమహాలక్ష్మిని చేసిన గొప్ప స్తోత్రం. ఈ స్తోత్రాన్ని భక్తిశ్రద్ధలతో విన్నవారు ఎంత దరిద్రులైనా ఐశ్వర్యవంతులవుతారు. ఒక 40 రోజులు విడిచిపెట్టకుండా చదివినా, శ్రవణం చేసినా వారి ఇంట్లో నేను కొలువై ఉంటాను అని శ్రీ మహలక్ష్మీదేవి వరమిచ్చింది.	

అగస్త్యకృత మహాలక్ష్మీస్తోత్రం👇


అగ్నిదేవుడు సర్వభక్షకుడు ఎలా అయ్యాడు👇


expand_less