Jan 16 2024జనవరి 16 2024favorite_border

"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
     🌟 జనవరి 16 2024 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం హేమంతఋతువు పుష్యమాసం శుక్లపక్షము

తిథి : పంచమి  ఉ. 07గం౹౹31ని౹౹ వరకు తదుపరి షష్ఠి
వారం : భౌమవారము (మంగళవారం)
నక్షత్రం : పూర్వాభాద్ర ఉ. 11గం౹౹29ని౹౹ వరకు తదుపరి ఉత్తరాభాద్ర
యోగం : పరిఘ రా. 08గం౹౹01ని౹౹ వరకు తదుపరి శివ
కరణం :  కౌలవ మ. 01గం౹౹03ని౹౹ వరకు తదుపరి తైతుల
రాహుకాలం : మ. 03గం౹౹00ని౹౹ నుండి 04గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉ. 09గం౹౹04ని౹౹ నుండి 09గం౹౹49ని౹౹ వరకు & రా. 11గం౹౹09ని౹౹ నుండి 12గం౹౹00ని౹౹ వరకు
వర్జ్యం : రా. 08గం౹౹27ని౹౹ నుండి 09గం౹౹57ని౹౹ వరకు
అమృతకాలం : తె. 05గం౹౹28ని౹౹ నుండి 07గం౹౹00ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 06గం౹౹38ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 05గం౹౹41ని౹౹కు

👉🕉️ కనుమ పండుగ 🕉️👈

గురుబోధ
ఆచరించాల్సిన విధి విధానాలు - సత్ఫలితాలు:
1) కనుమ నాడు కూడా తెల్లవారుజామునే లేవాలి స్నానం చేయాలి,  ఈరోజు గోపూజ చేయాలి. ఎద్దులను కూడా పూజించాలి. గోపూజ ను మించిన పూజ మరొకటి లేదు. సమస్త దేవతలు గోవులో ఉన్నారు.
2) ఈశ్వరుడి యొక్క అనుగ్రహం కలగాలంటే కనుమనాడు మాషచక్రాలను అంటే మినుములతో తయారుచేసిన గారెలను భగవంతునికి నివేదన చేసి, కాలభైరవునికి సమర్పించి, తాను తిని ఇతరులకు పెడితే మంచిదని శాస్త్రం చెపుతున్నది. వీలుంటే చెట్లను కూడా పూజించాలి. వృక్షాలను పూజిస్తే కుటుంబం పచ్చగా ఉంటుంది.

సురభి స్తోత్రమ్👇


కనుమ పండుగ ప్రాముఖ్యం👇


expand_less