"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జనవరి 11 2024 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం హేమంతఋతువు మార్గశిరమాసం కృష్ణపక్షము
తిథి : అమావాస్య రా. 06గం౹౹14ని౹౹ వరకు తదుపరి పాడ్యమి
వారం : బృహస్పతివారము (గురువారం)
నక్షత్రం : పూర్వాషాఢ రా. 06గం౹౹50ని౹౹ వరకు తదుపరి ఉత్తరాషాఢ
యోగం : వ్యాఘాత సా. 05గం౹౹49ని౹౹ వరకు తదుపరి హర్షణ
కరణం : చతుష్పాద ఉ. 06గం౹౹51ని౹౹ వరకు తదుపరి నాగ
రాహుకాలం : మ. 01గం౹౹30ని౹౹ నుండి 03గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉ. 10గం౹౹32ని౹౹ నుండి 11గం౹౹17ని౹౹ వరకు & మ. 03గం౹౹00ని౹౹ నుండి 03గం౹౹45ని౹౹ వరకు
వర్జ్యం : రా. 02గం౹౹27ని౹౹ నుండి 03గం౹౹59ని౹౹ వరకు
అమృతకాలం : మ. 02గం౹౹17ని౹౹ నుండి 03గం౹౹45ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 06గం౹౹38ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 05గం౹౹38ని౹౹కు
👉🕉️ మార్గశిర లక్ష్మీవారం, అమావాస్య 🕉️👈
గురుబోధ
మార్గశిర మాసంలో ప్రతి గురువారం లక్ష్మీమాత కు అత్యంత ప్రీతికరం. అందుకే ఈ నెలలో ప్రతి గురువారం "మార్గశిర లక్ష్మీవ్రతము" గా ఆచరిస్తారు. పూర్ణిమ, అమావాస్య మొ౹౹ పర్వదినములలో చేసే అర్చన, పూజ, జపం రెట్టింపు ఫలితాలను ఇస్తుంది. అగస్త్యకృత మహాలక్ష్మీ స్తోత్రాన్ని భక్తిశ్రద్ధలతో విన్నవారు ఎంత దరిద్రులైనా ఐశ్వర్యవంతులవుతారు. ఒక 40 రోజులు విడిచిపెట్టకుండా చదివినా, శ్రవణం చేసినా వారి ఇంట్లో నేను కొలువై ఉంటాను అని శ్రీ మహలక్ష్మీదేవి వరమిచ్చింది. సకల సంపదలు కావాలంటే, అనేక జన్మలలో మనం చేసిన పాపముల వలన లభించిన దారిద్య్రం తొలగాలంటే, తత్ క్షణం లక్ష్మీకటాక్షం లభించాలంటే శ్రీ లక్ష్మీదేవికి సంబంధించిన అష్టోత్తరశతనామ స్తోత్రాన్ని భక్తితో పారాయణం చేయాలి లేదా వినాలి.
అగస్త్యకృత మహాలక్ష్మీ స్తోత్రం👇ఇంద్రకృత లక్ష్మీస్తోత్రం👇శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం👇