"కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 జనవరి 01 2024 🌟 శ్రీ శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం హేమంతఋతువు మార్గశిరమాసం కృష్ణపక్షము తిథి : పంచమి మ. 12గం౹౹17ని౹౹ వరకు తదుపరి షష్ఠి వారం : ఇందువారము (సోమవారం) నక్షత్రం : మఘ ఉ. 07గం౹౹17ని౹౹ వరకు తదుపరి పుబ్బ యోగం : అయుష్మాన్ 2వ తేదీ తె. 04గం౹౹36ని౹౹ వరకు తదుపరి సౌభాగ్య కరణం : తైతుల మ. 02గం౹౹28ని౹౹ వరకు తదుపరి గరజి రాహుకాలం : ఉ. 07గం౹౹30ని౹౹ నుండి 09గం౹౹00ని౹౹ వరకు దుర్ముహూర్తం : మ. 12గం౹౹25ని౹౹ నుండి 01గం౹౹09ని౹౹ వరకు & మ. 02గం౹౹37ని౹౹ నుండి 03గం౹౹21ని౹౹ వరకు వర్జ్యం : సా. 04గం౹౹09ని౹౹ నుండి 05గం౹౹55ని౹౹ వరకు అమృతకాలం : రా. 02గం౹౹41ని౹౹ నుండి 04గం౹౹27ని౹౹ వరకు సూర్యోదయం : ఉ. 06గం౹౹33ని౹౹కు సూర్యాస్తమయం : సా. 05గం౹౹31ని౹౹కు 👉🕉️ పూజ్య గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గురుదేవుల దివ్యజన్మదివసం 🕉️👈 గురుబోధ ఎవరైతే గురువుల వద్ద మంత్రం స్వీకరించారో వారందరూ కూడా గురువుల యొక్క దివ్యజన్మదివసాన్ని పురస్కరించుకుని గురుపూజ, గురునామస్మరణంతో పాటు మనకిచ్చిన మంత్రం చేసుకోవడం ఉత్తమోత్తమం. గురువుల యొక్క జన్మదివసాన్ని జరుపుకోవడం మన కర్తవ్యం.