Dec 26 2023డిసెంబరు 26 2023favorite_border

"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
     🌟 డిసెంబరు 26 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం హేమంతఋతువు మార్గశిరమాసం శుక్లపక్షము

తిథి : పూర్ణిమ  తె. 05గం౹౹56ని౹౹ నుండి 27వ తేదీ ఉ. 06గం౹౹03ని౹౹ వరకు తదుపరి పాడ్యమి
వారం : భౌమవారము (మంగళవారం)
నక్షత్రం : మృగశిర రా. 10గం౹౹21ని౹౹ వరకు తదుపరి ఆర్ద్ర
యోగం : శుక్ల తె. 03గం౹౹22ని౹౹ వరకు తదుపరి బ్రహ్మ
కరణం :  విష్టి సా. 05గం౹౹51ని౹౹ వరకు తదుపరి బవ
రాహుకాలం : మ. 03గం౹౹00ని౹౹ నుండి 04గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉ. 08గం౹౹59ని౹౹ నుండి 09గం౹౹43ని౹౹ వరకు & రా. 10గం౹౹58ని౹౹ నుండి 11గం౹౹50ని౹౹
వర్జ్యం : తె. 03గం౹౹25ని౹౹ నుండి 05గం౹౹03ని౹౹ వరకు  
అమృతకాలం : మ. 01గం౹౹09ని౹౹ నుండి 02గం౹౹47ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 06గం౹౹31ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 05గం౹౹28ని౹౹కు

🕉️ మార్గశీర్ష పౌర్ణమి - దత్త జయంతి🕉️

దత్తాత్రేయ వజ్రకవచం👇


దత్తాత్రేయ స్తోత్రం👇


గురుబోధ
మార్గశిర పూర్ణిమని (రాత్రికి పూర్ణిమ తిథి ఉండాలి) దత్త జయంతిగా జరుపుకుంటాము. త్రిమూర్తి అవతారం దత్తాత్రేయ అవతారం. 
అత్రి పుత్రుడు కనుక ఆత్రేయుడు అని అన్నారు. దత్తాత్రేయుడు గొప్ప యోగి, అవధూత, సాక్షాత్తూ విష్ణు అవతారం కనుక భగవంతుడు. ఆత్మజ్ఞానాన్ని బోధించిన వాడు కనుక గురువు. సాక్షాత్తూ ఆ ఆదిలక్ష్మి అనఘాదేవిగా, దత్తాత్రేయుడికి భార్యగా వచ్చింది. ఈ పుణ్యదినమున ఆ దత్తాత్రేయుడిని అష్టోత్తర శతనామాలతో పూజించాలి. తెలుపు, పసుపు, ఎరుపు రంగు పూవులతో పూజించాలి. దధ్యోదనం (పెరుగన్నం), బెల్లంతో చేసిన గుడాన్నం నైవేద్యంగా సమర్పించాలి. "ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః" అనే మంత్రాన్ని జపించుకోవాలి. అవకాశం ఉంటే ఆ రోజు రాత్రి 10గంటలకి వెన్నెలలో కూర్చుని ఈ మంత్రాన్ని జపించుకుంటే ఉత్తమం. 
"దత్తాత్రేయుమ్ సుధీగేయం బ్రహ్మ విష్ణు శివాత్మకం | బాలార్క సదృశాభాసం శాంతమూర్తిమ్ నమామ్యహమ్" అనే శ్లోకాన్ని పఠించాలి. 
దత్తాత్రేయుడు చాలా భక్త సులభుడు. ఆయనని నమ్మి భక్తితో నమస్కరించినా కూడా ప్రసన్నుడు అవుతాడు. నిజమైన భక్తులను ఆయన పరీక్షిస్తాడు. ఆ దత్తాత్రేయుడిని నమ్మి ఆ పరీక్ష తట్టుకుని నిలబడగలిగితే ఆయన ప్రసన్నుడు అయి ఎప్పటికీ రక్షిస్తుంటాడు. 
దత్తాత్రేయుని 24 అవతారాలలో ముఖ్యమైనవి శ్రీ పాదవల్లభుడు, శ్రీ నృసింహ సరస్వతి అవతారములు.

expand_less